Site icon Neti Telugu

 జగన్ అడ్డాలో లోకేష్..వైసీపీకి భారీ డ్యామేజ్.!

కడప జిల్లా..జగన్ సొంత అడ్డా…వైసీపీకి కంచుకోట. ఇక్కడ వైసీపీని తప్ప మరొక పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి లేదు. గత రెండు ఎన్నికల్లోనూ అదే జరుగుతూ వస్తుంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే..గత ఎన్నికల్లో పది సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అలాంటి వైసీపీ కంచుకోటలోకి ఇప్పుడు లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్న లోకేష్..ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని..కడప జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాదయాత్ర ముగించుకుని, కడప జిల్లాలోని జమ్మలమడుగులోకి లోకేష్ ఎంటర్ అయ్యారు. అయితే వైసీపీ కంచుకోటగా ఉన్న కడపలో లోకేష్ పాదయాత్ర వల్ల ఏమైనా మార్పు వస్తుందా? ఇక్కడ టి‌డి‌పికి ఏమైనా అవకాశం దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరుకుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు పాదయాత్ర జరిగిన కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి కాస్త ఊపు వచ్చింది. అసలు టి‌డి‌పి పెద్దగా కనబడని నియోజకవర్గాల్లో టి‌డి‌పి జెండా ఎగరడం మొదలైంది. ఇంతకాలం వైసీపీని గెలిపిస్తూ వస్తున్న కొన్ని నియోజకవర్గాల ప్రజలు టి‌డిపి వైపు చూడటం మొదలుపెట్టారు.

ఇప్పుడు కడపలో కూడా అదే సీన్ కనబడుతుంది. అసలు కడపలో టి‌డి‌పి మొదట నుంచి మంచి విజయాలు సాధించలేదు. అప్పటిలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ సత్తా చాటూతూ వస్తుంది. కానీ ఇప్పుడుప్పుడే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఒకసారి టి‌డి‌పికి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కడపలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే.

అలాంటి స్థానాల్లో టి‌డి‌పి బలపడుతుంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి మరింత ఊపు వచ్చే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు మూడు సీట్లు వరకు గెలిచే ఛాన్స్ ఉంది. అదే జరిగితే కడపలో వైసీపీకి డ్యామేజ్ జరిగినట్లే

Exit mobile version