పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మంచి ప్రజా స్పందనతో లోకేష్ పాదయాత్ర ముందుకెళుతుంది. అలాగే తనదైన శైలిలో లోకేష్..ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజా సమస్యలని తెలుసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న అక్రమాలని ఎండగడుతూనే..అక్కడ స్థానికంగా ఉండే సమస్యలని హైలైట్ చేస్తున్నారు. ఇక ప్రతి వర్గం ప్రజలని లోకేష్ కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.

ఇదే తరుణంలో ఏపీలో అతి పెద్ద సమస్యగా ఉన్న పెట్రోల్, డీజిల్ రెట్లపై పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని, అందుకే ఏపీలో కూడా పెరిగాయని వైసీపీ నేతలు సెలవిస్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది..కేంద్ర ప్రభుత్వం మొదట రేట్లు పెంచిన..తర్వాత కొంతమేర తగ్గించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ పరిధిలో ఉన్న పన్నుల భారం తగ్గించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయి.

అందుకే తాజాగా లోకేష్..కర్ణాటక బోర్డర్ లో పాదయాత్ర చేస్తూ..అక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీ కంటే తక్కువగా ఉన్నాయని చూపించారు. దాదాపు రూ. 10 ఏపీ కంటే కర్ణాటకలో తక్కువగా ఉన్నాయి . ఇటు పక్కనే ఉన్న తెలంగాణలో కూడా అదే పరిస్తితి. మరి ఏపీలోనే ఎక్కువగా ఉండటానికి..ఇక్కడ జగన్ ప్రభుత్వం పన్ను పెంచడమే. అది కూడా శాతం రూపంలో పన్ను పెంచి కవర్ చేసింది.

దీని వల్ల ప్రజలపై పెను భారం పడుతుంది. వాహనదారులే కాదు..రవాణా ద్వారా వచ్చే ప్రతి నిత్యావసర వస్తువుపై భారం పడుతుంది. ఈ పరిస్తితి నుంచి ఉపశమనం కల్పించడానికే లోకేష్..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ లపై ఉన్న పన్నుల భారాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో వైసీపీకి డ్యామేజ్ జరగడం ఖాయమని చెప్పవచ్చు.
