రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలని ఎంత అణిచివేయాలని చూస్తే..అంత ఎక్కువగా ఆ పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుంది. అధికార పార్టీలు ఎక్కువ శాతం ప్రతిపక్షాలని దెబ్బకొట్టడానికే చూస్తాయి. రాజకీయంగా అయితే పర్లేదు గాని..అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలని అణిచివేయడానికి చూస్తాయి. అలా చేయడం వల్ల అధికార పక్షానికి నెగిటివ్ అయ్యి, ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీని ఏ విధంగా దెబ్బకొట్టాలని చూస్తుందో, పోలీసులని అడ్డం పెట్టుకుని, టీడీపీ నేతలని ఎలా ఇబ్బంది పెడుతున్నారో తెలిసిందే.

అలా అణిచివేయాలని చూడటమే టీడీపీకి అడ్వాంటేజ్ అయింది..ప్రజల్లో సానుభూతి పెరిగింది. అదే మాదిరిగా నారా లోకేష్‌ని ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వచ్చారో తెలిసిందే. అలా ఎగతాళి చేయడం వల్లే..లోకేష్ ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవ్వడానికి రెడీ అయ్యారు. ఇక ఈ పాదయాత్రకు ఎలాగోలా బ్రేకులు వేయాలనే కోణంలో వైసీపీ ఉంది. ఇదే క్రమంలో జీవో నెంబర్1ని అడ్డం పెట్టుకుని..లోకేష్ పాదయాత్రపై ఆంక్షలు విధించారు.

పాదయాత్రని రోడ్లపై పావు వంతులోనే చేయాలని, అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ప్రత్యేకంగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చేయాలనే ఆంక్షలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర, జాతీయ రహదారులపై సభలు నిర్వహించకూడదని రూల్ పెట్టారు. అయితే గతంలో జగన్ పాదయాత్ర చేసేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టలేదు.

ఫ్రీగా జగన్ పాదయాత్ర చేసుకునేలా అవకాశం కల్పించింది..పైగా రెచ్చాగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఇప్పుడు నిబంధనలు తెచ్చారు. జగన్ పాదయాత్రలో ఈ నిబంధన లేదు. అయితే ఇలా ఆంక్షలు పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఆంక్షలతో పాదయాత్రకు బ్రేకులు వేయాలని చూస్తే..ఆటోమేటిక్ గా లోకేష్ పై సానుభూతి పెరిగి..ఆయనకే అడ్వాంటేజ్ అవుతుంది.

Leave feedback about this