ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష టీడీపీని అడుగడుగున అధికార వైసీపీ అడ్డుకుంటూనే ఉందని చెప్పాలి. అంటే ప్రజా సమస్యలు తెలియకూడదని, ప్రతిపక్ష టీడీపీ బలం పెరగకూడదని చేస్తున్నారో తెలియదు గాని..గత మూడున్నర ఏళ్లుగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గాని, ఆ పార్టీ నేతలకు గాని పోలీసుల ద్వారా బ్రేకులు వేయిస్తున్నారు. అలా అడ్డుకోవడం వల్లే అనుకుంటా ప్రజల్లో టిడిపిపై సానుభూతి పెరిగినట్లు కనిపిస్తోంది.

అయితే ఇప్పుడు అదే క్రమంలో లోకేష్ పాదయాత్రకు కూడా అధికార వైసీపీ బ్రేకులు వేయడానికే చూస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో టిడిపి అధికారంలో ఉండగా జగన్ ఎంత ఫ్రీగా పాదయాత్ర చేసుకున్నారో అందరికీ తెలిసిందే. అలా పాదయాత్ర చేసే జగన్ అధికారంలోకి వచ్చారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే అనుకుంటా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడానికే వైసీపీ ప్రయత్నిస్తుందనే భావన వస్తుంది. లోకేష్ పాదయాత్రకు పోలీసులు పెట్టిన ఆంక్షలు చూస్తే అదే నిజమనిస్తుందని, ఇదంతా వైసీపీ చేయిస్తున్నదే అని టిడిపి శ్రేణులు అంటున్నాయి.

అన్నీ ఆంక్షలతో పాదయాత్ర చేయడమనేది చాలా కష్టమైన పని, అంటే లోకేష్ పాదయాత్ర ప్రజలకు చేరువ కానివ్వకుండా చేయడమే వైసీపీ టార్గెట్ గా కనిపిస్తుందని, కానీ అలా చేయడం వల్లే ఇంకా ప్రజలు లోకేష్ పాదయాత్రపై ఫోకస్ పెడుతున్నారని, లోకేష్ పాదయాత్ర ఇంకా హైలైట్ అవుతుందని చెబుతున్నారు.

ఇప్పటికే లోకేష్‌ని ఎగతాళి చేస్తూ..కించపరుస్తూ..ఆయన్ని ఒక పర్ఫెక్ట్ లీడర్ గా చేసిన ఘనత వైసీపీదే అని, ఇప్పుడు పాదయాత్రని టార్గెట్ చేస్తే..ఇంకా ఆయనకు అడ్వాంటేజ్ పెరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి లోకేష్ పాదయాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో.
