ఏదైనా సీఎం జగన్ తెలిసి చేస్తారా లేక తెలియక చేస్తారో తెలియదు గానీ, కొన్ని విషయాల్లో అనవసరంగా బుక్ అవుతారు. ఏ టైమ్‌లో ఏం చేయాలో జగన్‌కు తెలియదనే విమర్శ తెచ్చుకుంటారు. ఇప్పుడు అదే పరిస్తితి రాష్ట్రంలో నడుస్తోంది. వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో జగన్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేయాలి. పోనీ తమ ప్రజా ప్రతినిధులని ఫీల్డ్‌లోకి పంపాలి…ప్రజలకు మేమున్నామనే భరోసా ఇవ్వాలి. కానీ ప్రజలకు ఆ భరోసా మాత్రం దొరుకుతున్నట్లు కనిపించడం లేదు. పైగా ఒకరోజు ఏరియల్ సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. అటు వైసీపీ నేతలు కూడా ఫీల్డ్‌లో పెద్దగా కనిపించడం లేదు. పైగా ఇలాంటి సమయంలో జగన్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్ళడంపై విమర్శలు వస్తున్నాయి.

తాజాగా తెలంగాణలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లికి జగన్ హాజరయ్యారు. అలాగే అక్కడ సీఎం కేసీఆర్‌తో కలిసి మంతనాలు కూడా నడిపారు. అయితే పెళ్లికి వెళ్ళడం తప్పు లేదని, కానీ ఇలాంటి పరిస్తితుల్లో రాష్ట్రాన్ని గాలికొదిలేయడం అనేది కరెక్ట్ కాదనే వాదనలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకవైపు రాయలసీమ, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోయారని, ఈ పరిస్థితుల్లో వరద బాధితులను, రాయలసీమను రక్షించేందుకు వెళ్లకుండా, జగన్ వరుసగా పెళ్లిళ్లకు వెళ్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు.

జగన్ అధికారంలోకి రాబట్టే నిత్యం వర్షాలు కురుస్తున్నాయని భజన చేసేవాళ్లు, జగన్ వల్లే వరదలు, ప్రాణ నష్టమూ అని ఒప్పుకుంటారా? అని లోకేష్ లాజికల్‌గా ప్రశ్నించారు. అయినా ఇలాంటి సమయంలో ప్రజలని వదిలేసి ఫంక్షన్లకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని ప్రజలే భావించి పరిస్తితి ఉంది. అలాగే జగన్ వచ్చాకే వానలు వస్తున్నాయని వైసీపీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు వరదలు కూడా జగన్ వల్లే అని భావిస్తుంటారా? ఏం చెప్పలేని పరిస్తితి ఉంటుందని చెప్పొచ్చు. కానీ అనవసరంగా భజనలు చేస్తే ఇలాగే ఇరుక్కొవాల్సి వస్తుంది.

Discussion about this post