ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. గత రెండున్నరేళ్ల కాలంలో పార్టీ పుంజు కుందని.. నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ దూకుడు పార్టీకి ఎంతో ఉపకరిస్తోందని వారు చెబుతున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయిన తర్వాత.. ఇక ఆయన పుంజుకోవడం కష్టమనే వాదన తెరమీదికి వచ్చింది. కీలక నేత లే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, పార్టీ పరిస్థితి కూడా గందరగోళంలో పడిందనే కామెంట్లు కూడా వినిపించా యి. లోకేష్ వల్ల ఏమీ కాదని.. పార్టీ ఇక, లేనట్టేనని కూడా ఒకరిద్దరు నాయకులు ఆఫ్ దిరికార్డుగా చెప్పుకొ చ్చారు.
అయితే.. అనూహ్యంగా లోకేష్ పుంజుకున్నారు. గత రెండేళ్ల కాలంలో ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్‌ను కార్నర్ చేయడంలోనూ.. పంచ్ డైలాగులువిసరడంలోనూ.. ఆయన ముందున్న మాట వాస్తవం. అదేసమయంలో తనదైన శైలిలో జగన్ మోసపు రెడ్డి.. గన్ పేలదు.. వంటి డైలాగులతో యువతను బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇక, పార్టీలో గతంలో ఆయన సీనియర్లను లెక్కచేయరనే వాదనను కూడా చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రతి ఒక్కరితోనూ కలివిడిగా ఉంటున్నారు. వారు చెబుతున్న సూచనలను, సలహాలను తీసుకుంటు న్నారు. అదేసమయంలో తాను తన ఆలోచనలు కూడా వారితో పంచుకుంటున్నారు. దీంతో పార్టీ విష యంలో గతానికి భిన్నంగా లోకేష్ వ్యవహరిస్తున్నారనే వాదన ఇటీవల కాలంలో బాగానే వినిపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. ధర్నాలు, నిరసనలు.. ఇలా.. కార్యక్రమం ఏదైనా.. నేరుగా కార్యకర్తలతో కలిసి ముందుకు వస్తున్నారు. నేనున్నానంటూ.. పార్టీలో యువ నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా.. లోకేష్.. తదనైన శైలిలో దూకుడు చూపిస్తున్నారు.
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న సీనియర్లు.. లోకేష్ పుంజుకున్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. చంద్రబాబు కూడా లోకేష్‌కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం.. ఆహ్వానిస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు బహిరంగ వేదికలపై కూడా లోకేష్ వేస్తున్న పంచ్‌లు.. చేస్తున్న ప్రసంగాలు.. పార్టీకి ప్లస్ అవుతున్నాయని.. సీనియర్లు చెబుతుండడం గమనార్హం. మరో రెండేళ్ల సమయం ఉన్నందున మరింత పుంజుకునే అవకాశం ఉందని.. వచ్చే ఎన్నికలకు ప్రధాన నాయకుడిగా ఆయన తరయావుతారని చెబుతున్నారు.
Discussion about this post