టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్.. తరచుగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియో జకవర్గంలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ననుంచి విజయం దక్కించుకుని.. చరిత్ర సృష్టిం చాలనేది లోకేష్ వ్యూహంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆయన దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో అసలు ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారా? లేక టీడీపీకి అను కూలంగా ఉన్న నియోజకవర్గం వెతుక్కుంటారా? అనే చర్చ తెరమీదికి వచ్చింది.

ఎందుకంటే. మంగళగిరిలో వైసీపీ నేత… ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుస విజయాలు దక్కించుకున్నారు. పైగా ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మంచి పేరు కూడా ఉంది. దీంతో లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేసినా.. గెలిచేది లేదనేది ఆళ్ల వర్గం ధీమా. దీంతో టీడీపీలోనూ కొన్నాళ్ల వరకు ఇదే చర్చ సాగింది. అయి తే.. వీటికి చెక్ పెడుతూ.. లోకేష్ ఇదే తన నియోజకవర్గం అని ప్రకటించుకున్నారు. ఇక్కడ నుంచి గెలి చి.. చంద్రబాబుకు కానుకగా ఇస్తామని కూడా చెప్పారు.

ఈ క్రమంలోనే కొన్ని వారాలుగా లోకేష్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇటీవల ఆయన ఇక్కడి ప్రజలతో మా ట్లాడుతూ.. “ఒక్కసారి నన్ను గెలిపించండి. మంగళగిరిని ఎక్కడికో తీసుకువెళ్తా!“ అని హామీ ఇచ్చారు. అయితే.. దీనిని తొలుత ఎవరూ స్వాగతించకపోయినా.. ప్రజల్లో మాత్రం చర్చగా మారింది. వచ్చే ఎన్నిక ల్లో లోకేష్‌ను గెలిపిస్తే.. తప్పేంది? అనే మాట వినిపిస్తోంది. దీనిపై అమరావతి ప్రభావం కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో లోకేష్ ఇచ్చిన ఒక్క ఛాన్స్.. మిస్ ఫైర్ కాదని.. సక్సెస్ అవుతుందని.. టీడీపీలో చర్చ సాగుతుండడం గమనార్హం.

Discussion about this post