టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారాలోకేష్ త్వరలోనే పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఈ సంకేతాలను సాక్షాత్తూ ఆయన తండ్రి, మాజీ సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలకు చెప్పారు. త్వరలోనే చంద్రబాబు గ్రామ గ్రామానా తిరిగే కార్యక్రమం పెట్టుకోవాలని భావించారు. అయితే.. వయో సంబంధిత సమస్యలు ఉన్ననేపథ్యంలో తన కుమారుడు అయితే.. ఈ కార్యక్రమానికి బాగుంటుం దని భావించిన ఆయన.. తానుజిల్లాలకు పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలో ని ర్వహించే మహానాడు అనంతరం.. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. దీనికి సంబం ధించి ఆయన ఇప్పటికే శ్రీకారం చుట్టాలని అనుకున్నా.. మహానాడు ఏర్పాటు చేయాల్సి రావడంతోపా టు.. ఒక సారి జిల్లాల పర్యటనలను ప్రారంభించిన తర్వాత.. ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మహానాడు పూర్తయిన వెంటనే..జూన్ 1 లేదా 2వ తేదీల్లో పక్కా ప్రణాళికతో జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీని బలోపేతం చేయనున్నారు.

అదేసమయంలో తన ప్రభుత్వం ఎందుకు రావాల్సిన అవసరం ఉందో.. ఆయన వివరించనున్నారు. ఇదిలావుంటే.. తాను తిరగలేని.. గ్రామాల పరిధిలో.. నారా లోకేష్‌తో పాదయాత్ర చేయించాలని ఇప్పటికే నిర్ణయించుకున్న దరిమిలా.. దీనికి సంబంధించి కూడా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. భారీ ఎత్తున కాకున్నా.. ప్రతిగ్రామాన్నీ సందర్శించేలా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నట్టు.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఏడాది పాటు.. అంటే.. ఎన్నికలకు ముందు వరకు లోకేష్ గ్రామస్థాయిలోనూ.. చంద్రబాబు జిల్లాల స్థాయిలో పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నారు.

ఫలితంగా పార్టీని మళ్లీ బతికించుకోవడంతోపాటు.. అధికారంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించు కున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును.. గత ఎన్నికల సమయం లో వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తిరిగి దానిని దక్కించుకోవడం టీడీపీ ముందున్న ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలోనే లోకేష్‌ను గ్రామీణ స్థాయిలో పాదయాత్ర చేయించాలని నిర్ణయించుకున్నారు. దీనికి కూడా జూన్ 1 లేదా 2నే ముహూర్తం ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే.. ఎన్ని గ్రామాలు ఎలా పర్యటించాలనే దానిపై క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా .. వచ్చే ఏడాది వరకు ఈ పర్యటనలు నిర్వహించి.. తర్వాతే.. అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

Discussion about this post