తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ దెబ్బకు భయపడి చాలామంది నేతలు కొన్ని రోజులు బయటకు రాని సంగతి తెలిసిందే. కానీ వారందరికి బాబు ధైర్యం చెప్పి..మళ్ళీ రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేసేలా చేశారు. అలాగే బాబు జనంలో తిరుగుతూ పార్టీ బలాన్ని ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ పరిస్తితి మెరుగైందని చెప్పవచ్చు.

అయితే పార్టీ పరిస్తితి ఇంకా మెరుగు అవ్వాలి..అందుకే జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర ఉండనుంది. కుప్పం టూ ఇచ్చాపురం వరకు పాదయాత్ర ఉంటుంది. దాదాపు 100 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర కొనసాగుతుంది.

అయితే లోకేష్ పాదయాత్రకు ఇప్పటికే పార్టీ సన్నాహాలు చేస్తుంది. పాదయాత్ర సక్సెస్ అయ్యేలా పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళుతున్నారు. ఇక పాదయాత్ర బాధ్యతలని టీడీపీ యువ నేతలు చూసుకుంటున్నారు. రామ్మోహన్ నాయుడు, శ్రీరామ్, హరీష్, అప్పలనాయుడు, అఖిలప్రియ, గ్రీష్మ, బొజ్జల సుధీర్..ఇంకా పలువురు యువ నేతలు పాదయాత్ర నిర్వహణని చూసుకోనున్నారు. టీడీపీకి మద్ధతు పెరిగేలా లోకేష్ చేయనున్న పాదయాత్రకు ‘’ యువగళం‘’ అని పేరు పెట్టారు.

జనవరి నుంచి జనంలోకి లోకేష్ అంటూ పోస్టర్లు పోస్ట్ చేశారు. ‘’ యువగళం‘’ పేరుతో..ప్రజలకు దగ్గరవుతారని అంటున్నారు. మరి చూడాలి ఈ ‘’ యువగళం‘’ యాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో.

Leave feedback about this