లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడానికే వైసీపీ ప్రయత్నిస్తుందా? ఎలాగైనా పాదయాత్రకు బ్రేకులు వేయాలని చూస్తుందా? అంటే తాజాగా పాదయాత్రపై పోలీసులు పెట్టిన ఆంక్షలు చూస్తే అలాగే ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అసలు అలాంటి ఆంక్షలతో పాదయాత్ర చేయడం సాధ్యం కాదని, గతంలో జగన్‌కు తమ ప్రభుత్వం అలాంటి ఆంక్షలు విధిస్తే ఏం చేసేవారు..అసలు పాదయాత్ర చేసేవారు కాదు..అధికారంలోకి వచ్చేవారు కాదని అంటున్నారు.

అయితే టిడిపి శ్రేణులు ఇంతగా ఆవేదన చెందడానికి కారణం పాదయాత్రపై పోలీసులు పెట్టిన ఆంక్షలే. వరుస ప్రమాదాలు జరగడం వల్ల రోడ్లపై సభలు నిషేధం అని చెప్పారు..కానీ రోడ్డుపై పావు వంతులోనే పాదయాత్ర చేయడం అని రూల్ పెట్టడం సరికాదని అంటున్నారు. పాదయాత్ర చేసేటప్పుడు రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు అన్నీ చోట్ల ఉండవు..అలాంటి అప్పుడు సభలు నిర్వహణ ఎలా కుదురుతుంది..ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు మైకులు లేకుండా లేకుండా ఎలా మాట్లాడగలుగుతారు. ఒకవేళ మైకులో మాట్లాడతాలంటే ప్రతిసారి పోలీసుల పర్మిషన్ ఎలా తీసుకుంటారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఇక పాదయాత్రలో డీజేలు, లౌడ్ స్పీకర్లు ఉండకూడదని, చిన్న స్పీకర్లు ఉండాలని రూల్ పెట్టారు. అసలు అలాంటివి లేకుండా పాదయాత్రలో సందడి ఎక్కడ ఉంటుంది..అప్పుడు జగన్ డీజేలు, లౌడ్ స్పీకర్లతోనే కదా పాదయాత్ర చేసిందని అడుగుతున్నారు. అడుగడుగున రూల్స్ పెట్టి..అతిక్రమిస్తే పాదయాత్రని ఆపుతామని పోలీసులు చెప్పడం బట్టి చూస్తే పక్కా ప్లాన్ ప్రకారం లోకేశ్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం బ్రేకులు వేయాలని చూస్తుందని అంటున్నారు.

పైగా 400 రోజుల పాదయాత్ర అయితే..మొదట 3 రోజులకు పర్మిషన్ ఇచ్చారు..ఇక ఎక్కడకక్కడ సబ్ డివిజన్ల పరిధిలో డిఎస్‌పిల దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకోవాలని అనడం సమంజసం కాదని చెబుతున్నారు. మరి ఇన్ని కండిషన్స్ మధ్య లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుందో చూడాలి.
