March 28, 2023
ముందస్తుపై చర్చ..లోకేష్-పవన్‌లకు బ్రేకులు?
ap news latest AP Politics

ముందస్తుపై చర్చ..లోకేష్-పవన్‌లకు బ్రేకులు?

తెలంగాణలో ఎలాగో ముందస్తు ఎన్నికల గురించి ఎప్పటినుంచో జరుగుతుంది. గతంలో ఎలాగో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కాబట్టి..ఈసారి కూడా ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రతిపక్షాలు భావించి..ఆ దిశగా పనిచేస్తున్నాయి. అయితే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. టీడీపీ శ్రేణులు ముందస్తుకు రెడీగా ఉండాలని అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక పెరిగిపోయిందని, ఈ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు యాక్టివ్ లేకుండా చేసి జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ముందస్తుపై పెద్ద క్లారిటీ లేదు. కాకపోతే ముందస్తుతో సంబంధం లేకుండా ఇటు టీడీపీలో నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. 400 రోజుల పాటు, 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.

జనవరి 27 నుంచి పాదయాత్ర మొదలవుతుంది..అక్కడ నుంచి 400 రోజులు అంటే..2024 మార్చి వచ్చేస్తుంది. అంటే ఆ తర్వాత నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇటు పవన్ సైతం బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. త్వరలోనే బస్సు యాత్ర మొదలుకానుంది.

అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికల బట్టి లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర జరగనుంది..మరి ముందస్తు ఎన్నికలకు వెళితే అప్పుడు పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు..అప్పుడు రెండు యాత్రలు ఆపేయాల్సిందే. చూడాలి మరి జగన్ రాజకీయం ఎలా ఉంటుందో?

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video