నారా లోకేష్ పాదయాత్ర మొదట రోజు ఘనంగా ప్రారంభమైంది. కుప్పంలో లోకేష్ తొలి అడుగు పడింది. భారీ ఎత్తున టిడిపి శ్రేణులు, నేతలు తరలివచ్చారు. భారీ శ్రేణుల మధ్య లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఇక అడుగడుగున ప్రజలని కలుస్తూ లోకేష్ ముందుకెళ్లారు. రెండోరోజు కూడా అదే ఉత్సాహంతో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఎక్కడకక్కడ ప్రజలని కలుస్తూ, వారి సమస్యలని తెలుసుకోవడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇక మొదటి రోజు కుప్పంలో భారీ స్థాయిలో సభ జరిగింది.

ఇక లోకేష్ స్పీచ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గతంలో స్పీచ్‌కు, ఇప్పుడు స్పీచ్‌కు చాలా తేడా ఉంది. గతంలో తడబాట్లు ఉండేవి..తప్పులు ఉండేవి..ఇప్పుడు వాటిని అధిగమించి లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే..మధ్య మధ్యలో జగన్ ప్రభుత్వంపై పంచ్‌లు వేస్తూ వచ్చారు. ఇలా మొదట రోజు పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది.

కానీ గుండెపోటుతో తారకరత్న కుప్పకూలడంతో టిడిపి శ్రేణుల్లో కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులో చికిత్స కొనసాగుతుంది. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ పార్టీలో యాక్టివ్ కావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ ఒక్క విషాద ఘటన మినహా ఆద్యంతం లోకేష్ పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగింది. రెండో రోజు కూడా విజయవంతంగా పాదయాత్ర కొనసాగుతుంది. అయితే పోలీసులు ఎక్కడ ఆంక్షలతో ఇబ్బందులు పెడతారనే డౌట్ టిడిపి శ్రేణుల్లో ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఇక పాదయాత్రతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ పాదయాత్ర టిడిపిని అధికారంలోకి తీసుకొస్తుందని భావిస్తున్నారు.
