పాదయాత్ర ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్ర వల్ల తమకు నష్టం లేదని, అసలు లోకేష్ పాదయాత్రని ప్రజలు పట్టించుకోరు అని, తమ పాలనలో సమస్యలు లేవని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అంటే పాదయాత్ర చేసినా, చేయకపోయినా వైసీపీకి పెద్ద ఇబ్బంది లేదు. అలాంటప్పుడు పాదయాత్రపై ఆంక్షలు పెట్టడం ఎందుకు..పోలీసులు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా అనేక ఆంక్షలు పెట్టేలా ఉన్నారు. అధికారంలో వైసీపీ తలుచుకుంటే..లోకేష్ పాదయాత్రకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎలాగో పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు కాబట్టి..లోకేష్ పాదయాత్రని స్వేచ్ఛగా జరగనివ్వండి చాలు అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అలాగే లోకేష్‌ని జనం పట్టించుకోరు అని చెబుతున్నప్పుడు..అడ్డుకోవాలని వైసీపీ శ్రేణులకు మెసేజ్‌లు ఎక్కడ నుంచి వెళుతున్నాయని ప్రశ్నలు వస్తున్నాయి.

పాదయాత్రను అడ్డుకోండి, దాడులకు సిద్దం కావాలి అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతూ వైసీపీ నేతలు మెసేజ్‌లు పంపుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం వైసీపీ నేత, ఎంపీపీ కోదండ రెడ్డి పేరుపై సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది.

అసలు పాదయాత్ర ప్రభావం లేదనుకున్న వారు..ఇలా అడ్డుకోవాలని మెసేజ్‌లు ఎలా పెడుతున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇక పాదయాత్ర ఎవరు ఆపుతారో చూస్తామని, దమ్ముంటే అడ్డుకుని చూడాలని వైసీపీ శ్రేణులకు టీడీపీ శ్రేణులు సవాల్ చేస్తున్నాయి. చూడాలి మరి లోకేష్ పాదయాత్ర సజావుగా సాగనీస్తారో లేదో.

Leave feedback about this