యువగళం పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రతో ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నారు. గతానికి భిన్నంగా లోకేష్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం వస్తుంది. అలాగే ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ వారికి అండగా నిలబడుతున్నారు. అలాగే వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక సమావేశాలు పెడుతూ వారికి భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎంత ఆర్ధికంగా చితికిపోయారో వివరిస్తున్నారు.
అలాగే స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని బయటపెడుతున్నారు. ఆయన ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే..అక్కడ ఎమ్మెల్యే అక్రమాలని ఆధారాలతో సహ బయటపెడుతున్నారు. ఇప్పటి వరకు అదే పనిచేసుకుంటూ వచ్చిన లోకేష్..తాజాగా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్, వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డిలని గట్టిగా టార్గెట్ చేశారు. అయితే ఇద్దరు నేతలు కోట్లు విలువ చేసే భూములు మింగేస్తున్నారని సర్వే నెంబర్లతో సహ వారి అక్రమాలని బయటపెడుతున్నారు. అయితే ఇప్పటికే అక్కడ వైసీపీ నేతలు అక్రమాలు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో లోకేష్ ఎంట్రీ ఇచ్చి ప్రజలకు మరింత అర్ధమయ్యేలా వివరణ ఇచ్చారు.

ఈ అంశం వైసీపీకి బాగా మైనస్ అవుతుంది. అది కూడా కోడుమూరులో లాంటి కంచుకోటలో వైసీపీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. ఇదే క్రమంలో టిడిపి పికప్ అవుతుంది. అసలు ఇక్కడ టిడిపి గెలిచి దాదాపు 38 ఏళ్ళు అవుతుంది..అంటే ఎప్పుడో 1985లో మాత్రమే కోడుమూరులో టిడిపి గెలిచింది.
ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ టిడిపి గెలవలేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడ టిడిపి గెలుపుకు అవకాశాలు మెరుగు పడ్డాయి. ఇక లోకేష్ పాదయాత్రతో టిడిపికి మరింత ప్లస్ అవుతుంది. ఇదే ఊపుని కొనసాగిస్తే కోడుమూరులో టిడిపి జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.