May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

పల్లెపై లోకేష్ పట్టు..రూరల్‌లో సైకిల్ జోరు.!

తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయి నుంచి బలం ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లోనే టి‌డి‌పి దారుణంగా దెబ్బతింది. రూరల్ ప్రాంతాల్లో వైసీపీ సత్తా చాటింది. టి‌డి‌పి 23 సీట్లు గెలిస్తే..అందులో మెజారిటీ సీట్లు సిటీల్లోనే ఉన్నాయి. అంటే రూరల్ ప్రాంతాల్లో టి‌డి‌పి పెద్దగా సత్తా చాటలేదని అర్ధమవుతుంది.

రూరల్ ప్రజలు వైసీపీని ఆదరించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలకు చేస్తున్నది ఏమి లేదు. పైగా 80 శాతం పంచాయితీలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి..అయినా గ్రామాల్లో అభివృద్ధి లేదు..కనీస సౌకర్యాలు లేవు. పంచాయితీ నిధులని సైతం వైసీపీ డైవర్ట్ చేసేస్తుంది. దీంతో వైసీపీ సర్పంచ్ లే లబో దిబో అంటున్నారు. సొంత పార్టీపైనే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో టి‌డి‌పి రూరల్ ప్రాంతాల్లో గట్టిగా ఫోకస్ చేసింది. ఓ వైపు చంద్రబాబు..రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళుతున్నారు.

ఇక లోకేష్ కీలకంగా గ్రామీణ ప్రాంతాలని కవర్ చేస్తూనే పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సర్పంచ్ లతో లోకేష్ సమావేశమయ్యారు. టి‌డి‌పి అధికారంలోకి వస్తే గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తారో వివరించారు.  గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, గ్రీన్‌ అంబాసిడర్‌ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తామని, కేంద్రం ఇచ్చే ప్రతి పైసాను ఎక్కడా దారి మళ్లించకుండా పంచాయతీలకే జమ చేస్తామని, నిధులు ఇవ్వడమే కాకుండా సర్పంచుల గౌరవాన్ని, గౌరవ వేతనాన్ని పెంచుతామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

ఇక వైసీపీ తీసుకొచ్చిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని, వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ హామీలు పల్లె ప్రజలని బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇది ఇంకా ప్రజల్లోకి వెళితే పల్లెటూర్లలో టి‌డి‌పి జోరు మరింత పెరుగుతుంది.