May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

మా నమ్మకం నువ్వే జగన్..అవినాష్ ఆశలు..!

‘మా నమ్మకం నువ్వే జగన్’ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ చేస్తున్న కార్యక్రమం. అంటే ఇంటింటికి వెళ్ళి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లని అతికిస్తున్నారు. ఇలా అతికించి..ప్రతి ఒక్కరూ జగన్ పైనే నమ్మకం పెట్టుకోవాలని, మళ్ళీ ఆయన్ని గెలిపించాలని కోరుకుతున్నారు. అయితే ప్రజలు జగన్ పైన నమ్మకం పెట్టుకున్నారో లేదో గాని..ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం జగన్ పైనే నమ్మకం పెట్టుకున్నారని టి‌డి‌పి శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి.

ఎందుకంటే గత ఎన్నికల ముందు జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకాని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇక హత్య చేయించింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో ఏం జరుగుతూ వస్తుందో అందరికీ తెలిసిందే. నిదానంగా ఆ కేసులో ఉన్న నిందితులని సి‌బి‌ఐ అరెస్ట్ చేస్తూ వస్తుంది.

ఇదే క్రమంలో అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది..ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. సి‌బి‌ఐ సైతం అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని కోర్టుకు వివరించింది. దీంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇక ఆ అంశం అలా నడుస్తుండగానే ఇటు జగన్..అవినాష్ రెడ్డిని కాపాడే పనిలో పడ్డారని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే వైఎస్ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారితో జగన్ భేటీ అయినట్లు తెలిసింది. అలాగే ఈయన 21 వ తేదీన విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఇటు అనంతపురం పర్యటనని ఈ నెల 26కు వాయిదా వేసుకున్నారు. దీని బట్టి చూస్తే అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్ కష్టపడుతున్నారని తెలుస్తోంది. మరి అవినాష్ నమ్మకం నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.