రాష్ట్రంలో రాజకీయాలు వేరు..మాచర్లలో వేరు అనే పరిస్తితి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా ఆధిపత్య రాజకీయం ఉంటుంది. అధికారంలో ఉన్న వైసీపీ తమ హవానే నడవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకు టిడిపిని ఎక్కడకక్కడ అణిచివేయడానికే చూస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే టిడిపి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మానందరెడ్డి వచ్చారో అప్పటినుంచి మాచర్లలో సీన్ మారింది.
టిడిపి శ్రేణులు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టాయి. వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నాయి. జూలకంటి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కానీ దూకుడుగా ఉన్న టిడిపిని అణిచివేయడానికి వైసీపీ వేయని ఎత్తులు లేవు. ఎక్కడ టిడిపికి ప్రజల మద్దతు పెరుగుతుందనే టెన్షన్ తో…టిడిపిని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ అణిచివేత ఎంత దూరం వెళ్లిదంటే..తాజాగా జూలకంటి పుట్టిన రోజు ఉంది..ఆ కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు ఘనంగా చేసుకోవడానికి ప్లాన్ చేశాయి. కానీ అక్కడే ట్విస్ట్ వచ్చింది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వీల్లేదని, జూలకంటి మాచర్ల వదిలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

అసలు జూలకంటి ఏమి నిరసనలు తెలియజేయడం లేదు..ఆయన పుట్టిన రోజు వేడుకలే జరుగుతున్నాయి అంటే పుట్టిన రోజుని సైతం జరుపుకోకుండా చేయాలని చూస్తున్నారంటే..అక్కడ వైసీపీకి ఎంత టెన్షన్ ఉందో అర్ధం చేసుకోవచ్చని టిడిపి శ్రేణులు అంటున్నాయి. అంటే ఘనంగా కార్యక్రమం జరుపుకుని..ప్రజల్లో ఇంకా దూకుడుగా ఉంటారని చెప్పి ఆ వేడుకలకు సైతం పోలీసుల ద్వారా వైసీపీ అడ్డుకోవాలని చూస్తుందని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి.
ఒకవేళ అడ్డుకున్న అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయని, కనీసం పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకునే స్వేచ్ఛ మాచర్లలో లేదనే పరిస్తితి..అక్కడి ప్రజలకు అర్ధమవుతుందని, దాంతో వైసీపీకే నష్టం తప్ప..టిడిపికి పోయిదేమీ లేదని అంటున్నారు. మొత్తానికి మాచర్ల ప్రజలు టిడిపి వైపు చూస్తున్నారు కాబట్టే..వైసీపీ ఇలాంటి పనులు చేస్తుందని ఫైర్ అవుతున్నారు
