వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా దాడులు జరగడం, కేసులు పెట్టడం, అరెస్టులు జరగడం..అనేవి కామన్ అయిపోయాయి. ఇక అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా ఉండటం అనేది సహజ ప్రక్రియగా మారిపోయింది..వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రక్రియ మరింత ఎక్కువగా ఉంది. సరే ఏదేమైనా గాని టీడీపీ శ్రేణులు గట్టిగా పోరాడుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎదురు నిలబడుతున్నారు.

అయినా సరే టీడీపీ కార్యకర్తలకు, నేతలకు చుక్కలు కనబడుతూనే ఉన్నాయి..అయితే ఇంత జరుగుతున్నా సరే..ఇదంతా టీడీపీ వాళ్ళ కుట్ర అని, ఇవన్నీ చంద్రబాబు, లోకేష్ చేయిస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపించడం అదొక పెద్ద వింతగా ఉంది. తాజాగా మాచర్లలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇదేం ఖర్మ కార్యక్రమం చేస్తున్న టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్ళు, గాజు సీసాలతో దాడి చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా దాడులు చేశాయి.

ఇక దీంతో పోలీసులు టీడీపీ వాళ్ళని అడ్డుకున్నారు..జూలకంటిని అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు యధేచ్చగా..టీడీపీ వాళ్లపై దాడులు చేయడం..ఇళ్లని తగులుబెట్టడం, పార్టీ ఆఫీసుకు, వాహనాలకు నిప్పుపెట్టడం చేశారు. ఇదంతా అయిపోయాక పోలీసులు వచ్చి..పరిస్తితులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఏం జరిగిందో క్లియర్ గా అందరికీ తెలుస్తోంది.

కానీ ఇదంతా చంద్రబాబు, లోకేష్, జూలకంటి కలిసి చేసిన పని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా మొత్తం కథని తిప్పేసి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని, మంత్రి అంబటి రాంబాబుగాని చెబుతున్నారు. అటు కార్యకర్తలని పరామర్శించడానికి టీడీపీ నేతలని పోలీసులు మాచర్లకు వెళ్లనివ్వడం లేదు. ఇలా పూర్తిగా వన్ సైడ్‌గా మాచర్లలో పరిస్తితులు ఉన్నాయి. పైగా బాబు అంతా చేశారని ఎదురుదాడి..అయితే నిజమే ఇందులో బాబు తప్పు ఉందని..అధికారంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ అని చేతులు కట్టేశారని, ఈ సారి ఆ పరిస్తితి లేదని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాయి. మొత్తానికి మాచర్లలో రాజకీయ మంటలు రేగుతున్నాయి.
