రాజకీయాల్లో నేతల పార్టీ మార్పు అనేది సహజంగానే జరిగే ప్రక్రియ..నేతలు అవసరాల కోసం అధికార పార్టీల్లోకి వెళుతుంటారు. పైకి ప్రజల కోసం పార్టీ మారుతున్నామని చెబుతారు గాని..ఏ నేతకైనా సొంత ప్రయోజనాలే ముఖ్యమని చెప్పవచ్చు. అలా వెళ్ళేవారిని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే గతంలో టిడిపి అధికారంలో ఉండగా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేశారు. కానీ అందులో మళ్ళీ ఎన్నికల్లో ఒక్కరే గెలిచారు. మిగతా వారంతా ఓడిపోయారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక నలుగురు టిడిపి, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లారు. వీరు నెక్స్ట్ ఎంతవరకు గెలుస్తారో చెప్పలేం. కానీ ఇలా జంప్ చేసిన వారు కూడా పార్టీ మార్పులపై నీతులు చెబితే జనం నమ్మడం కష్టం. ఎందుకంటే ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి క్రాస్ ఓటు వేశారు. దీంతో వారిపై వైసీపీ ఫైర్ అవుతుంది..వారు అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు. అయితే నిజమైన వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తే కాస్త అర్ధం ఉంటుంది.

కానీ టిడిపి నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారు మాట్లాడటమే విడ్డూరం. తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి..టిడిపిపై విమర్శలు చేశారు. తనకు కూడా డబ్బులు ఆఫర్ ఇచ్చారని అన్నారు. అసలు ఈయన టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. పైగా ఎన్నికలైపోయిన వారంకు ఈయన విమర్శలు చేస్తున్నారంటే..అదంతా ఓ స్క్రిప్ట్ అని అర్ధమవుతుంది.
ఇక గుంటూరు వెస్ట్ లో మద్దాలి గిరికి మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని తాజా సర్వేలు చెబుతున్నాయి. అసలే గుంటూరు వెస్ట్ టిడిపికి కంచుకోట. టిడిపికి జనసేన గాని తోడైతే గుంటూరు వెస్ట్ లో మద్దాలి ఓటమి ఖాయమని తెలుస్తోంది.
