గత కొంతకాలంగా ఆంధ్రా నుండి హెవీ లోడ్ తో 100కు పైగా లారీలు మదిర పట్టణ రూరల్ ప్రాంతం నుండి రణ గొణ ధ్వనులతో వెళ్తున్నాయి.

ఈ లారీలు వెళ్లే దారిలో రోడ్లు గుంతల పడి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పరిణమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజానికం ఈ లారీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి నాయకులు గత కొంతకాలంగా రెవిన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. కానీ ఈ లారీల ప్రవాహం మాత్రం ఆగలేదు. ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకోవటానికి బిజెపి నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గల్లా సత్యనారాయణ ఏలూరు నాగేశ్వరావులఆధ్వర్యంలో ఈరోజు ఆత్కూర్ క్రాస్ రోడ్ లో తమ కార్యకర్తలతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. దీనితో లారీ డ్రైవర్లకు బిజెపి కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి.
ఈ క్రమంలో బిజెపి కార్యకర్తకు గాయాలయ్యాయి. తీవ్ర కోపోద్రిక్తులైన బిజెపి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ
పోలీసులు, ఆర్టీవో అధికారులు అక్కడకు చేరుకొని ఇసుక లారీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇప్పటి నుండి మధిర ప్రాంతాల నుండి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటామని బిజెపి నాయకులు ఘంటాపథం గా చెప్పారు.రాజకీయ పార్టీ అంటే ప్రజాభిషానికి తలొగ్గాలి కానీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు చెక్కుపెట్టే విధంగా ఉండాలి. అక్రమ ఇసుక రవాణా విషయంలో మధిర ప్రాంత ప్రజల అభిమానికి అనుగుణంగా బిజెపి పార్టీ పోరాటం చేయడంతో ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. బిజెపి పార్టీ నాయకుల సాహసోపేతాలను ఇక్కడ ప్రజలు మెచ్చుకుంటున్నారు.
