ప్రస్తుతం ఒంగోలు వేదిగా జరుగుతున్న మహానాడు.. పార్టీలో జోష్ నింపిందా? పార్టీని పుంజుకునేలా చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కార్యకర్తల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వరకు కూడా.. అందరూ కూడా ఒకే మాటపై ఉన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలి. కార్యకర్తలే పార్టీని ముందుకు నడిపించాలి. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక.. అనే మాటను బలంగా వినిపించారు.

ఇప్పుడు ఇదే.. పార్టీలో బాగా పనిచేస్తున్న మంత్రం అంటున్నారు పరిశీలకులు. పార్టీ ఏదైనా.. అధికారం లోకి రావాలన్నా.. అందలం ఎక్కాలన్నా..జెండా మోసే కార్యకర్తలు కావాలి. పపార్టీ పిలుపు మేరకు రోడ్డెక్కే నాయ కులు కావాలి. కార్యకర్తల నుంచే నాయకులు తయారు అవుతారు. కార్యకర్తల నుంచే పార్టీని బతికిం చుకునే నాయకులు బయటకు వస్తారు. అందుకే..కార్యకర్తలకు ఒకప్పుడుకాంగ్రెస్ బాగా ప్రాధాన్యం ఇచ్చింది.ఇది ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసింది.

ఫలితంగా ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎంతటి నాయకులు వచ్చినా.. కాంగ్రెస్ ఆధిపత్యం ఇప్పటికీ చాలా రా ష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను… టీడీపీ కూడా అనుసరించాలని నిర్ణయించు కుం ది. నిజానికి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత.. టీడీపీకి అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. ఇలాం టి సమయంలో నాయకుల కన్నా కూడా.. కార్యకర్తలే ముందుకు వచ్చారు. అంతే.. పార్టీలో మళ్లీ జోష్ ప్రారంభమైంది. అయితే.. అదేసమయంలో కార్యకర్తలకు కూడా ఇబ్బందులువచ్చాయి.

పోలీసుల కేసులు, జైలు పాలు కావడం.. వంటివి తెరమీదికివచ్చాయి. ఈ నేపథ్యంలో వారికి పార్టీ తరఫున అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా మహానాడులో ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా ప్రస్తావించారు. పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటున్న కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వంలోకి రాగానే.. ఒక్క సంతకంతో కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తేసేలా చర్యలు తీసుకుంటామని.. ప్రకటించారు. దీంతో పార్టీలో జోష్ పెరిగిందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post