రేపే ప్రారంభం కానున్న టీడీపీ పసుపు పండగ మహానాడు.. ఒంగోలు వేదికగా జరగ నున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా.. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గానే నిర్వహిం చిన పార్టీ అధిష్టానం.. ఈ ఏడాది మాత్రం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని నిర్ణయించింది. పైగా.. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేం దుకు.. పార్టీలో నేతల ను మరింత పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దీనికి గాను మహానాడును వేదికగా చేసుకుని.. ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మహానాడును ప్రతి ష్టాత్మంగా తీసుకుంది. రెండు రోజుల పాటే నిర్వహించాలని తలపెట్టినప్పటికీ.. దీనిని భారీ రేంజ్‌లో నిర్వ హించేలా ప్రణాళిక చేశారు. పార్టీకి భవిష్యత్ ప్రణాళికలను ఈ వేదికగా చంద్రబాబు వెల్లడించను న్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ మహానాడు ఏర్పాట్లను ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నాయకులు ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతుల తేవడం.. 100 ఎకరాల్లో.. ఏర్పాట్లు చేయడం వంటివి అన్నీ కూడా .. ఈ ముగ్గురే చూస్తుండడం గమనార్హం.

వారే.. టీడీపీ యువనాయకుడు.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మహానాడు వేదిక ఏర్పాట్ల నుంచి అతిథులకు ఆహ్వానం పలకడం వరకు.. వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంనుంచి అన్ని ఏర్పాట్లను వీరు ఇక్కడే ఉండి చూస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు నాయకులు కూడా ఒంగోలులోనే తిష్టవేసి మరీ.. పార్టీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు.. వారు చేపడుతున్నారు. షడ్రశోపేతమైన వంటకాలను తయారు చేసేందుకు పలు ప్రాంతాల నుంచి వంట మాస్టర్లను పిలిపించారు.


అదేసమయంలో స్థానికంగా ఉన్న అన్ని హోటళ్లు, కళ్యాణ మండపాలను కూడా.. అతిథుల కోసం ముందుగానే రిజర్వ్ చేశారు. పార్టీ అధినేత కోసం.. ప్రత్యేకంగా ఒక సూట్‌ను కూడా బుక్ చేసి పెట్టారు. కార్యకర్తలతో సమన్వయం చేసుకునేందుకు.. ప్రత్యేకంగా ఎన్టీఆర్ గ్యాలరీ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ .. అదేవిధంగా ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. మహిళల కోసం.. ప్రత్యేకంగా టాయిలెట్లు.. ఏర్పాటు చేశారు. వారి భద్రత కోసం.. సీబీఎన్ ఆర్మీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.



ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకుని.. మరీ.. ఈ ఏర్పాట్లు చేయడం గమనార్హం. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేసేందుకు కొన్ని కేంద్రాలనుఏర్పాటు చేస్తున్నారు. ఇలా.. ఈ ముగ్గురు నేతలు కూడా మహానాడు క్రతువువును తమ భుజాలపై వేసుకునిముందుకు నడిపిస్తుండడం గమనార్హం.


Discussion about this post