రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తన సత్తా నిరూపించుకునేం దుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవకాశం చిక్కినప్పుడల్లా. పార్టీలు.. తమ బలాన్ని నిరూపించుకుని… వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ సత్తా ఇదీ.. అని చాటుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత ఏప్రిల్‌లో జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా.. పార్టీ జనసమీకరణ బాగానే చేసి. గత 2019 ఎన్నికల్లో తాము సత్తా చూపించలేక పోయినా.. తమకు ప్రజా బలం ఉందని నిరూపించింది.

దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకం అవుతుందని అందరూ అనుకున్నారు. అంతేకాదు.. జనసేనాని పవన్ కూడా.. తనతో మాట్లాడేందుకు.. వచ్చే పార్టీలతో తాను చర్చించేందుకు సిద్ధంగానే ఉన్నానని చె ప్పారు. దీంతో పొత్తులపై చర్చలకు తన దగ్గరకే రావాలనే సంకేతాలు పంపించారు. కట్ చేస్తే.. ఇక, ఇప్పుడు టీడీపీ మహానాడు నిర్వహించింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు.. నిర్వహించిన ఈ టీడీపీ ఏమేరకు హిట్ అవుతుందో.. అనే సందేహాలు ఉన్నాయి.

కానీ, ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ.. భారీ ఎత్తున అబిమానులు, ప్రజలు హాజరయ్యారు. అంటే.. ఒకరకంగా.. టీడీపీ అనుకున్న దానికంటే.. కూడా ఎక్కువగానే ప్రజలు వచ్చారు. దీంతో అనూహ్యంగా టీడీపీలోనూ ధీమా పెరిగింది. అంటే.. ఇప్పటి వరకుపొత్తులు లేకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావించిన పార్టీకి ప్రజల మద్దతు చూసేసరికి పొత్తులతో పెద్దగా పనిలేదనే సంకేతాలు వచ్చాయి. ఇప్పటివరకు.. జనసేనతోపొత్తు పెట్టుకుంటే… 40 నుంచి 50 సీట్ల వరకు త్యాగాలు చేయకతప్పదని అనుకున్నారు.

కానీ… మహానాడు జోష్‌తో ఈ సంఖ్య 25 నుంచి 30 కి పడిపోయిందని.. తెలుస్తోంది. అంటే.. జనసేన ముం దుకు వచ్చినా.. తాము పాతికకు మించి సీట్లు ఇచ్చేదిలేదని.. ఈ విషయంలో ఎలాంటి చర్చలు లేవని తెగేసి చెప్పినా.. సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో మహానాడు జోష్ బాగా పనిచేసిందని అంటున్నారు.. పైగా .. పొత్తులకు వెళ్లాక.. బెట్టు చేసేందుకు కూడా అవకాశం చిక్కిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు జనసేన ఏం చేస్తుందో చూడాలి.

Discussion about this post