వైసీపీలో ప్రతి నాయకుడు అధికార బలంతో తమకు తిరుగులేదని భావిస్తున్నారు. అసలు ఇంకా తమకు ఓటమి లేదని అనుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు అదే పరిస్తితుల్లో ఉన్నారు. కానీ ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటుందే వైసీపీ మంత్రులు..25 మంది మంత్రులు ఉంటే అందులో 15 పైనే మంత్రులు వ్యతిరేకత ఎదురుకుంటున్నారు.
ఇక అందులో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. అయితే నలుగురు మహిళా మంత్రులు ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇందులో మొదట రోజా గురించి చెప్పుకోవాలి. నగరి నుంచి రెండుసార్లు గెలిచిన ఈమెకు..ఈ సారి అక్కడ గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. మంత్రిగా ఉన్నా సరే ఏం పనిచేస్తున్నారో ఎవరికి క్లారిటీ లేదు. ఇక జగన్ కు భజన చేయడం, ప్రతిపక్షాలని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆమెకు ఏ మాత్రం పాజిటివ్ లేదు. ఈ సారి నగరిలో రోజా ఓటమి దిశగా వెళుతున్నారు.

ఆ తర్వాత కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ ఎక్కువ వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. తొలిసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు..కానీ ఈమె మంత్రి అనే సంగతి ప్రజలందరికీ పూర్తిగా తెలియదు. అటు కళ్యాణదుర్గంలో ఆమెకు నెగిటివ్ ఉంది. ఇటు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న మంత్రి విడదల రజిని..సొంత నియోజకవర్గంలో చిలకలూరిపేటలో మాత్రం పాజిటివ్ తెచ్చుకోలేకపోయారు. అక్కడ ఆమె ఓటమి దిశగా వెళుతున్నారు.
ఇక హోమ్ మంత్రి తానేటి వనిత…పేరుకు హోమ్ మంత్రి గాని..ఈమె చేతుల్లో అధికారాలు ఉన్నట్లు కనిపించడం లేదు. వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. మొత్తానికి మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు స్థానాల్లో టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయి.