ఏపీ మంత్రుల్లో ఈ సారి ఎంతమంది గెలిచి గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ వేవ్ ఉండటం డౌట్..అటు జగన్ ఇమేజ్ కూడా అంత వర్కౌట్ కాకపోవచ్చు. అలాగే ప్రతిపక్ష టిడిపి బలపడుతుంది..జనసేనతో కలిసి వస్తే వైసీపీకి ఇబ్బందులు పెరుగుతాయి. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ ఎంతమంది మంత్రులు గెలుస్తారో చెప్పలేని పరిస్తితి. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే టిడిపి హయాంలో మంత్రులుగా చేసిన వారు గెలిచారు.

అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరరావు, నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే గెలిచారు. అంటే మంత్రులుగా చేసే వారు త్వరగా ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే వారు మంత్రులుగా ఉంటూ సొంత నియోజకవర్గానికి కాస్త దూరమవుతారు. అలాగే మంత్రులుగా పెద్దగా రాణించకపోతే కష్టాలు తప్పవు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పరిస్తితి అంతే. పైగా నలుగురైదుగురు మినహా మిగిలిన మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవడం గాని, అభివృద్ధి పనులు చేయడం గాని తక్కువ. ఏదో సంతకాలు పెట్టడానికి, ప్రతిపక్షాలని తిట్టడానికే మంత్రులు అన్నట్లు పరిస్తితి ఉంది.

ఇక జగన్ క్యాబినెట్ లో ఉన్న నలుగురు మహిళా మంత్రులది కూడా అదే పరిస్తితి అని తెలుస్తోంది. రోజా, విడదల రజిని, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్‌లు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా వీరిలో రాణించేది ఎవరు కనిపించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో వీరిలో రోజాకు గెలుపు అవకాశాలు బాగా తగ్గాయి. నగరిలో సొంత పార్టీ వాళ్ళే రోజాని ఓడిస్తామని అంటున్నారు.



అటు కళ్యాణదుర్గంలో ఉషశ్రీ పరిస్తితి కూడా పెద్దగా బాగోలేదు. ఇక చిలకలూరిపేటలో రజినికి ఈ సారి గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపించడం లేదు. కొవ్వూరులో టిడిపిలో అంతర్గత విభేదాలు ఉండటం వల్ల అక్కడ వనితకు కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అక్కడ టిడిపి నేతలు కలిసి పనిచేస్తే వనితకు రిస్క్. మొత్తానికి నలుగురు మహిళా మంత్రులు మళ్ళీ గట్టెక్కడం డౌటే.


