దేవినేని ఉమా..తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు..కృష్ణా జిల్లా రాజకీయాలపై పట్టున్న నేత. వరుస విజయాలతో సత్తా చాటిన నాయకుడు..కేవలం ఒక్కసారి అనూహ్యంగా ఓటమిని చూశారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన ఉమా…2019 ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయారు. మైలవరంలో వైసీపీ అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఉమా ఓడిపోయారు.
అయితే అలా ఓటమి పాలైన ఉమా నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తున్నారు. మైలవరంలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక ఇటీవల సర్వేల్లో కూడా మైలవరంలో టిడిపి గెలుపు ఖాయమైందని తేలింది. అలా గెలుపు దగ్గరలో ఉండగా, మైలవరం సీటు ఉమాకు దక్కడం లేదని ప్రచారం మొదలైంది..మైలవరం బరిలో కొత్త నాయకుడుని పోటీకి దింపుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్న మరో టిడిపి నేత బొమ్మసాని సుబ్బారావుతో ఉమాకు పడటం లేదు. సుబ్బారావు..ఉమాకు పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు.

దీంతో మైలవరం టిడిపిలో గ్రూపు తగాదాలు పెరిగాయి. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత టిడిపిలోకి వచ్చి నెక్స్ట్ మైలవరంలో పోటీ చేస్తారనే ప్రచారం కూడా వస్తుంది. కానీ ఈ ప్రచారంలో కూడా నిజం లేదని తేలిపోయింది. కానీ ఇప్పుడు కొత్త నేత పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. అయితే అది నిజం కాదనే తెలుస్తోంది. కేవలం ఉమాని దెబ్బకొట్టడానికి ప్రత్యర్ధులు ఆడుతున్న మైండ్ గేమ్ అని తెలుస్తోంది.
చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే ఉమాని కాదని మైలవరం సీటు వేరే వాళ్ళకు దక్కడం కష్టమే. పైగా టిడిపి అభ్యర్ధిగా ఉమాకే ఎక్కువ మద్ధతు ఉందని టిడిపి సర్వేల్లో తేలింది. అలాంటప్పుడు మైలవరం సీటు వేరే వాళ్ళకు ఇచ్చే ప్రసక్తి లేదని తెలుస్తోంది. మైలవరం మళ్ళీ ఉమాకే దక్కనుంది.
