ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఓ వైపు అధికార బలంతో వైసీపీ ముందుకెళుతుంటే..నెక్స్ట్ అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ బలం పెంచుకుంటూ వెళుతుంది. అయితే వైసీపీకి ధీటుగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో బలమైన నాయకులని పార్టీలోకి తీసుకునేందుకు అధినేత చంద్రబాబు చూస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీ రాజ్..చంద్రబాబుని కలవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హర్షకుమార్ కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి..అమలాపురం సీటు ఆశించారు. కానీ ఆ సీటు బాలయోగి తనయుడు హరీష్‌కు ఇచ్చారు. దీంతో ఎన్నికలయ్యాక హర్షకుమార్ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ లో సరైన పదవి దక్కలేదు. దీంతో అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్..హర్షకుమార్‌తో భేటీ అయ్యారు.

దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది..ఇక ఊహించని విధంగా ఇటీవల హర్షకుమార్ తనయుడు జీవీ రాజ్..చంద్రబాబుతో భేటీ అయ్యారు. అలాగే ఆయనని కలిశాక.. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, జగన్ మోహన్ రెడ్డి పాద యాత్రలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్రలను విజయవంతం చేసిన అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు అంటూ రాజ్ పోస్ట్ పెట్టారు.

అంటే టీడీపీకి సపోర్ట్ గా రాజ్ ఉన్నారని అర్ధమైంది. అదే సమయంలో రాజ్‌కు..పి.గన్నవరం సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ టీడీపీకి సరైన నాయకుడు లేరు. దీంతో రాజ్‌కు ఆ సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. మరి హర్షకుమార్ సైతం టీడీపీలోకి వస్తారేమో చూడాలి.

Leave feedback about this