సాధారణంగా అధికార పార్టీ నేతలకు కాస్త అహం ఎక్కువ ఉంటుందనే చెప్పొచ్చు. ఎవరైనా తాము చెప్పినట్లే వినాల్సిందే అనుకుంటారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు ఇంకా ఎక్కువ అహం ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్ళు చెప్పిందే వేదం…తాము ఏదైనా మాట్లాడతాం…ఎవరైనా తిడతాం…మమ్మలని ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో ఉంటున్నారు. అందుకే గడిచిన రెండున్నర ఏళ్లలో వైసీపీ నేతల అరాచకాలు ఏ విధంగా నడిచాయో అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అహాన్ని మరొకసారి బయటపెట్టారు. ఇప్పటికే పలుమార్లు విష్ణు నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. టీవీ డిబేట్‌లో టిడిపి నాయకురాలు అనురాధాపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో అందరికీ తెలిసిందే. తాజాగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుని ఉద్దేశించి మల్లాది తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కొన్నేళ్లుగా నాన్చుతున్న సీపీఎస్, పీఆర్సీలను ఉద్దేశించి ఇళ్ల చేసిన వ్యాఖ్యలపై విష్ణు నోరు పారేసుకున్నారు.ప్రస్తుత పాలకలు ఉద్యోగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని, ఇంకా పలు అంశాలపై ఇళ్ల మాట్లాడారు.

దీనిపై స్పందిస్తూ.. డోంటాక్. ఎమ్మెల్సీ అని గౌరవమిస్తున్నా గుర్తు పెట్టుకోండి. మీ ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏం సాధిస్తారు? అంటూ, ఇంకా చాలా రకాలుగా వార్నింగ్ ఇచ్చేశారు. అటు ఇళ్ల కూడా ప్రతిస్పందించే ప్రయత్నం చేశారు గానీ, విష్ణు నోరు పారేసుకోవడం మాత్రం ఆపలేదు. దీంతో విష్ణుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే అందరూ వైసీపీ వాళ్ళ లాగా జగన్‌కు భజన చేయాలని? పిడిఎఫ్ నేతలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక 25 ఓట్లతో గెలిచిన విష్ణు…ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ…ఆ 25 ఓట్లు పోగొట్టుకున్నారని, నెక్స్ట్ విష్ణుకు సెంట్రల్‌లో చుక్కలు కనిపిస్తాయని సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

Discussion about this post