ఏపీ ప్రధాన ప్రతిపక్షం.. టీడీపీ నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఒక ప్రాంతీయ పార్టీకి.. అందునా.. భిన్నమైన పార్టీల వ్యవహారం.. అనేక భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ప్రజల నుంచి గెలుపు గుర్రం ఎక్కడం.. ఇన్నాళ్లు సుదీర్ఘంగా పాలన.. చేయడం.. ప్రతిపక్ష పార్టీగా ప్రముఖ పాత్ర పోషించడం.. వంటివి.. పార్టీకి మైలు రాళ్లుగానే భావించాలి. అయితే.. గతించిన కాలం కంటే.. రాబోయే కాలానికి పార్టీని ముందుకు నడిపించడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిపోయింది.

ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను త్యజించి.. మున్ముందుకు దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనే కాదు… కొందరు నేతలు చెబుతున్నట్టు.. వారు ఆకాంక్షిస్తున్నట్టు.. వచ్చే 20 ఏళ్లపాటు.. పార్టీని అధికారంలో ఉంచాలంటే.. ఖచ్చితంగా దశ, దిశ రెండూ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంపై ఇప్పుడు టీడీపీలోని కొందరు మేధావులు మళ్లీ అన్నగారి బాటనే అను సరించాలని సూచిస్తునన్నారు.

అన్నగారు చెప్పినట్టు.. ఆయన చూపిన దారిలో నడవాలని చెబుతున్నా రు. అదే.. ప్రజా బాట. మళ్లీ చైతన్య రథం దుమ్ముదులిపి.. ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు. గతంలో తనకు ఏ కష్టం వచ్చినా.. అన్నగారు ప్రజల మధ్యకువ చ్చేవారు. వారి మధ్యే ఉండేవారు. రోడ్ల పక్కనే స్నానాలు చేసేవారు. వారితో కలిసి భోజనాలుచేసేవారు. తనకష్టం.. వారి కష్టం అన్నీ.. అక్కడే పంచుకునేవారు.

ఇప్పుడు మళ్లీ ఇదే కావాలని.. ప్రజల మనసులు చూరగొనాలంటే.. ప్రజలను పార్టీవైపు తిప్పాలంటే.. డిజిటల్ మాధ్యమానికి తోడు.. డైరెక్ట్ మాధ్యమాలకు పార్టీని నడిపించాలని.. అన్నగారు చూపిన మార్గమే శరణ్యమని.. సీనియర్లు చెబుతున్నారు. 2024లోనూ ఇదే ఫార్ములాతో వెళితే గెలుపు పక్కా అంటున్నారు. అప్పుడే.. పార్టీ మళ్లీ అధికారంలోకి రావడమే కాకుండా.. వచ్చే 20 ఏళ్లపాటు మనగలుగుతుందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post