మాట తప్పను..మడమ తిప్పను..ఇది జగన్ నినాదం అని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు డప్పు కొడుతూ ఉంటారు. అదే చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని అబద్దాలు చెబుతూ ఉంటారు. అయితే జగన్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు..అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారో ప్రజలకు తెలిసిందే. ప్రతి విషయంలోనూ మాట తప్పడమే..మడమ తిప్పడమే. 45 ఏళ్లకే పెన్షన్, రైతు భరోసా, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం..అబ్బో ఒకటి ఏంటి చాలా ఉన్నాయి..ఇలా మాట ఇచ్చి..మాట తప్పిన హామీలు.

అవన్నీ ప్రజలకు తెలుసు..అలా చెప్పిన వాటిలో చేయకుండా ఉన్న అంశాల్లో మండలి రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చాక శాసనసభలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది గాని..శాసన మండలిలో లేదు. అక్కడ టిడిపికి ఆధిక్యం ఉంది. దీంతో ఏ బిల్లు తెచ్చిన అసెంబ్లీలో ఆమోదం పొందిన..మండలిలో కొన్ని బిల్లుల అంశంలో ఆమోదం వచ్చేది కాదు. దీంతో మండలిపై జగన్ కు కోపం వచ్చింది. అక్కడ ఉన్నవాళ్ళు అంతా రాజకీయ నిరుద్యోగులే అని, ప్రజాధనం వృధా అవుతుందని, అందుకే మండలి రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ చెప్పారు.
అలాగే రద్దుపై బిల్లు పెట్టి అసెంబ్లీలో ఆమోదించి..కేంద్రానికి పంపారు. ఇంకా అంతే ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు..దాన్ని ఫాలో అప్ చేయడం లేదు. ఎలాగో వైసీపీ ఎమ్మెల్సీలు పెరుగుతూ వచ్చారు. దీంతో రాజకీయ నిరుద్యోగులకు మండలిలో అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో మండలి రద్దు అంశం పక్కకుపోయింది. ఇప్పుడు మూడు, నాలుగు ఎమ్మెల్సీలు పోతే వైసీపీ కింద మీద పడుతుంది. అసలు మండలి రద్దు అన్నప్పుడు మాట మీద ఉండి ఎమ్మెల్సీ పదవులు తీసుకోకుండా ఉంటే సరిపోయేది కదా.
