గత ఎన్నికల్లో సంచలన ఫలితం వెల్లడైన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ డైరక్ట్ గా నారా లోకేష్ బరిలో దిగారు. తొలిసారి లోకేష్ పోటీ చేయడంతో..ఆయన గెలుపుపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై వైసీపీ నేతలు ఇప్పటికీ ఎగతాళి చేస్తున్నారు. అయితే ఈ ఓటమి లోకేష్‌ని నాయకుడుగా మార్చిందని చెప్పవచ్చు. లోకేష్ పూర్తిగా మారారు. తన బాడీ లాంగ్వేజ్, తన లాంగ్వేజ్ మొత్తం మార్చుకున్నారు. మళ్ళీ మంగళగిరిలో గెలవడమే లక్ష్యంగా లోకేష్ ముందుకెళుతున్నారు.

అక్కడ ప్రజలకు అండగా ఉంటూ..సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి పనులు చేయిస్తున్నారు. ఇక ఆయన గెలుపు దగ్గరకు అవుతున్నారనుకునే సమయంలో…లోకేష్‌కు చెక్ పెట్టడానికి వైసీపీ కొత్త ఎత్తులతో ముందుకొచ్చింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలని వైసీపీలోక్ లాక్కున్నారు. మాజీ మంత్రి మురుగుడు హన్మంతరావుని వైసీపీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత గంజి చిరంజీవులని వైసీపీలోకి తీసుకున్నారు.

దీంతో మంగళగిరిలో లోకేష్‌కు చెక్ పడుతుందని ప్రచారం చేశారు. అయినా సరే లోకేష్ వెనక్కి తగ్గకుండా మంగళగిరిలో పనిచేస్తూ వచ్చారు. ఏ మాత్రం బలం తగ్గకుండా చూసుకున్నారు. ఇదే సమయంలో రివర్స్ స్కెచ్ తో మంగళగిరిలో కీలకమైన వైసీపీ నేతలని టీడీపీలోకి తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేత, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 18వ తేదీన లోకేష్ సమక్షంలో టీడీపీలోకి వస్తున్నారు. ఈ విధంగా వైసీపీకి రివర్స్ కౌంటర్లు ఇస్తూ లోకేష్ షాకులు ఇస్తున్నారు.
