ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు..ఈ సారి ఖచ్చితంగా మంగళగిరి బరిలో గెలిచి తీరాలని కసిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి లోకేష్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ ఎత్తులు, వైసీపీ వేవ్ లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓడిపోయారు. ఇక ఓడిపోయాక లోకేష్‌ని వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వచ్చారో తెలిసిందే. దీంతో లోకేష్ లో పూర్తిగా మార్పు వచ్చింది..ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా ఎదుగుతూ..ఓడిన చోటే మళ్ళీ పనిచేస్తూ..అక్కడ ప్రజలకు అండగా ఉంటూ లోకేష్ ముందుకు నడిచారు.

సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. పేద ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చింది. పైగా ఈ మూడున్నర ఏళ్లలో అక్కడ జరిగిన అభివృద్ధి పెద్దగా లేదు. ఇక రాజధాని అమరావతి ఇష్యూ ఎలాగో ఉంది. ఈ పరిణామాల మధ్య మంగళగిరిలో వైసీపీకి యాంటీ పెరిగింది.

ఇక అక్కడ లోకేష్ గెలుపుకు అన్నీ అనుకూల పరిస్తితులు కనిపిస్తున్నాయి. అయితే అంతా సెట్ చేసుకుని లోకేష్ పాదయాత్రకు వెళుతున్నారు. ఇక లోకేష్ పాదయాత్రకు వెళ్ళాక..మంగళగిరిలో వైసీపీ కొత్త ప్లాన్స్ తో ముందుకొస్తుందనే ప్రచారం ఉంది. ఇప్పటికే లోకేష్ ని దెబ్బతీయడానికి కొందరు టీడీపీ నేతలని వైసీపీలోకి లాక్కున్నారు. లోకేష్ పాదయాత్రకు వెళ్ళాక..అక్కడ వైసీపీ కుట్రలు చేసే ఛాన్స్ ఉందని, వాటిని టీడీపీ శ్రేణులు ఎదుర్కోవాలని లోకేష్ పిలుపునిస్తున్నారు. మరి చూడాలి మంగళగిరిలో లోకేష్ బలం వైసీపీ తగ్గించగలదో లేదో.

Leave feedback about this