Site icon Neti Telugu

మహానాడులో మేనిఫెస్టో..బాబు మాస్టర్ స్కెచ్.!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేక ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? అనేది తెలియడం లేదు. షెడ్యూల్ ప్రకారమైతే..2024 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..ఇంకా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపటం కష్టమని భావిస్తే..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. తెలంగాణతో పాటు ఈ ఏడాది చివరిలోనే ఏపీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేయవచ్చు.

ఆ దిశగానే జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ మధ్య ఎక్కువగా సభలు పెడుతూ ప్రజల్లో ఉంటున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో బటన్ నొక్కుతున్నారు. దీని బట్టి చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ లేకపోలేదు. సరే ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. ఆయన మొదట నుంచి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, టి‌డి‌పి శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. పార్టీని ముందస్తు ఎన్నికలకు రెడీ చేస్తున్నారు.

ఇక ముందస్తు ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే బాబు..వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో ఆయన మేనిఫెస్టో కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ మహానాడులో మేనిఫెస్టోలోని కొన్ని కీలక హామీలని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వచ్చే విజయదశమికి మేనిఫెస్టోని ప్రకటిస్తారని సమాచారం.

వైసీపీకి చెక్ పెట్టేలా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రజలని ఆకట్టుకునేలా హామీలు ఇస్తారని, ప్రధానంగా యువత, మహిళా ఓటర్లని టార్గెట్ చేసుకుని మేనిఫెస్టో రూపోదించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు మేనిఫెస్టో సిద్ధం చేశారని అంటున్నారు. చూడాలి మరి మహానాడులో బాబు ఎలాంటి ప్రకటన చేస్తారో.

Exit mobile version