కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత రెండు ఎన్నికల్లోనూ కర్నూలులో వైసీపీ సత్తా చాటుతూనే వస్తుంది…ఏ మాత్రం టీడీపీకి ఛాన్స్ ఇవ్వకుండా వైసీపీ విజయయాత్ర కొనసాగుతుంది…అయితే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ జైత్రయాత్ర కొనసాగుతుందా? అంటే కొనసాగడం కష్టమనే చెప్పాలి…ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వైసీపీపై వ్యతిరేకత ఉంది…అలాగే కర్నూలు జిల్లాల్లో కూడా మార్పు కనిపిస్తోంది..పూర్తి స్థాయిలో కాకపోయిన…చాలా వరకు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు…వరుసగా రెండు సార్లు వైసీపీని గెలిపించిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది…ఈ క్రమంలోనే ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పు కనిపిస్తోంది…ఇదే క్రమంలో మంత్రాలయంలో టీడీపీ ఆధిక్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది…గత మూడు ఎన్నికల్లో మంత్రాలయంలో బాలనాగిరెడ్డి తిరుగులేని విజయాలు అందుకున్నారు. అయితే 2009లో నాగిరెడ్డి టీడీపీ నుంచి గెలిచారు..తర్వాత వైసీపీ వైపుకు వెళ్లి…2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు..ఇలా మూడుసార్లు నాగిరెడ్డి మంత్రాలయంలో గెలిచారు. మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాగిరెడ్డి…మంత్రాలయంలో మార్పు ఏమన్నా తీసుకొచ్చారా?అంటే పెద్దగా లేదనే చెప్పొచ్చు.

పోనీ 2009, 2014 లో అధికారంలో లేరు కాబట్టి…అప్పుడు పెద్దగా పనులు చేయలేకపోయారని చెప్పొచ్చు…మరి 2019లో అధికార ఎమ్మెల్యేగా ఉన్నారు…అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రాలయంలో మార్పు ఏం తెచ్చారు? అంటే..అధికార పార్టీ నేతల్లో మార్పు వచ్చింది గాని…ప్రజల జీవితాలైతే మారలేదని చెప్పొచ్చు. ఒకానొక సమయంలో తమ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పారంటే..మంత్రాలయంలో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అదే సమయంలో టీడీపీ నేత తిక్కారెడ్డి..ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాడుతున్నారు..ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన తిక్కారెడ్డి…మూడోసారైనా గెలవాలని కష్టపడుతున్నారు. ప్రజలు కూడా తిక్కారెడ్డి పట్ల కాస్త సానుభూతితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు నాగిరెడ్డిని చూశారు కాబట్టి…ఈ సారి తిక్కారెడ్డి వైపు మొగ్గు చూపితే బెటర్ అనే ఆలోచనలో మంత్రాలయం ప్రజలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ సారి మంత్రాలయంలో ఫ్యాన్ రివర్స్ అయ్యేలా ఉంది.

Discussion about this post