వైసీపీ మంత్రుల్లో బాగా దూకుడుగా ఉండేవారిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు….అసలు తాను జగన్ కోసం ప్రాణమైన ఇచ్చేస్తానని, జగన్‌ని ఎవరైనా ఏమన్నా ఉంటే ఊరుకొను అనే స్థాయిలో అనిల్ మాట్లాడేస్తుంటారు. అసలు జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకునే మంత్రుల్లో అనిల్ ముందు ఉంటారు. ఇక ఆ మంత్రి…తాజాగా చంద్రబాబు, లోకేష్‌ల గురించి ఏ స్థాయిలో విమర్శలు చేశారో చెప్పాల్సిన పని లేదు. రాయలేని విధంగా అనిల్ మాట్లాడేశారు.

అయితే పట్టాభి…జగన్‌ని తిట్టడంతో అనిల్‌లో ఈ ఫైర్ వచ్చేసిందని అనుకోవచ్చు. అలా అంటే ఎన్నిసార్లు అనిల్…చంద్రబాబు, లోకేష్‌లని తిట్టి ఉంటారు…ఎన్నిసార్లు తమకు ఫైర్ రావాలని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. బూతులు మాట్లాడేది వీళ్ళే…మళ్ళీ టిడిపి నేతలు బూతులు మాట్లాడుతున్నారని నీతులు చెప్పేది కూడా వీళ్ళే అని. అనిల్‌తో పాటు మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో మాట్లాడతారో అందరికీ తెలుసని, ఇలా మాట్లాడే నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు.

అసలు నెల్లూరు సిటీలో మళ్ళీ అనిల్‌కు ఛాన్స్ రాకుండా ఆపుతామని టిడిపి శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఏదో అదృష్టం కొద్దీ రెండుసార్లు స్వల్ప మెజారిటీతో అనిల్ గెలుస్తూ వస్తున్నారని, ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వమని అంటున్నారు. గత ఎన్నికల్లోనే అనిల్‌కు చుక్కలు కనబడేవి అని, కానీ చిన్న మెజారిటీతో బయటపడిపోయారని, పైగా మంత్రి అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, మంత్రి పదవికి న్యాయం చేయడం లేదు…అటు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని నెల్లూరు సిటీ టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

అలాగే అనిల్ అనుచరుల అక్రమాల గురించి చెప్పాల్సిన పని లేదని మాట్లాడుతున్నారు. ఇలా ప్రజల బాగోగులు పట్టించుకోకుండా జగన్‌కు భజన చేస్తూ, చంద్రబాబుని బూతులు తిట్టే అనిల్‌కు నెక్స్ట్ హ్యాట్రిక్ ఛాన్స్ ఇవ్వమని, ఈ సారి నెల్లూరు సిటీలో టిడిపి జెండా ఎగిరేలా చేస్తామని చెబుతున్నారు. మరి చూడాలి అనిల్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ వస్తుందో లేదో.

Discussion about this post