తాము ప్రజలకు మంచి పనులు చేస్తుంటే..కావాలని టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కుట్రలు చేస్తూ..తమపై బురద జల్లుతూ, తమని ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని, కానీ ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పి జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీ చేసే పనులు ఏంటో ప్రజలకు క్లారిటీ ఉంది. కొందరు వైసీపీ నేతల అక్రమాలు సంగతి కూడా తెలుసు. వాటిపైనే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే వరుసపెట్టి కథనాలు వస్తూనే ఉన్నాయి..అయితే మీడియాలో కథనాలు వచ్చినంత మాత్రాన వాటిని ప్రజలు నమ్మాలని లేదు. కానీ అందులో వాస్తవానికి దగ్గరగా ఉంటే ప్రజలు నమ్మే పరిస్తితి ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో దోపిడి, భూ కబ్జాల గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అలాగే పలువురి మంత్రులపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రజలకు నిజనిజాలు ఏంటి అనేది బేరీజు వేసుకోగలరు. దాదాపు వాస్తవాలకు దగ్గరగా ఉండటంతో ఆ అంశాలు వైసీపీని పెద్ద డ్యామేజ్ చేస్తున్నాయి.

అందుకే తాజాగా జగన్ సైతం..మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో మంత్రులకు జగన్ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారట. మరో 16 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, ఈ సమయంలో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, మంత్రులే లక్ష్యంగా అవినీతి ఆరోపణలతో కథనాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినట్టు సమాచారం.

కొన్ని మీడియా సంస్థలు మంత్రులపై అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలు వస్తే, వాటి ప్రభావం ప్రజలపై తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే మీడియాలో వైసీపీ మంత్రుల అవినీతి అంటూ పెద్ద కథనాలు వచ్చాయి. ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ కూడా అయింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని వస్తాయో చూడాలి.

Leave feedback about this