మొదట నుంచి మన్యం ప్రాంతంలో రాజకీయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవి…అక్కడ ఉండే దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ కు మద్ధతుగా నిలిచేవారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాణించిన సందర్భాలు తక్కువ. ఇక కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నాక..మన్యం ప్రజలు వైసీపీని ఆదరించడం మొదలుపెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించారు. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ మంచి విజయాలు సాధిస్తూ వస్తుంది.

జిల్లాలో సాలూరు, పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క పార్వతీపురం నియోజకవర్గం మాత్రం ఎస్సీ రిజర్వడ్ కాగా, మిగిలిన మూడు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వడ్. ఇక ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో పార్వతీపురం మినహా మిగిలిన మూడు స్థానాలని వైసీపీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో అన్నీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. మరి వచ్చే ఎన్నికల్లో కూడా మన్యంలో వైసీపీ హవా నడుస్తుందా? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని చూస్తుంటే…ఈ సారి ఫలితాలు తారుమారయ్యేలా ఉన్నాయి.

ఇప్పటికే మన్యంలో సీన్ రివర్స్ అయింది…వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. రెండు సార్లు వైసీపీ వైపు నిలిచిన సరే…మన్యంలో పెద్దగా మార్పు రాలేదు. అసలు అభివృద్ధి పెద్దగా లేదు..అటు పథకాలు కొందరికి అందుతున్నాయి. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక…తమ ప్రాంతంలో మార్పులు వచ్చేస్తాయని మన్యం ప్రజలు భావించారు. కానీ తీరా మూడేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పటికీ మన్యం ప్రజలు హాస్పిటల్స్ కూడా వెళ్లాలంటే అదే వాగులు, వంకలు దాటుతూనే ఉన్నారు.

పైగా ప్రజాప్రతినిధులు కూడా తమ సమస్యలని పరిష్కరించింది లేదు…అందుకే ఈ సారి మన్యం ప్రజలు వైసీపీకి రివర్స్ లో తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి చుక్కలు చూపించేలా ఉన్నారు.

Discussion about this post