May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

మారని నూజివీడు తమ్ముళ్ళు..బాబు తేల్చాల్సిందే!

రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి..టి‌డి‌పి బలపడుతుంది.నెక్స్ట్  అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి ముందుకెళుతుంది. ఇలాంటి పరిస్తితులు ఉన్నా సరే ఇంకా కొందరు టి‌డి‌పి నేతలు మారడం లేదు. ఎక్కడకక్కడ ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో నూజివీడు నియోజకవర్గంలో తమ్ముళ్ళ మధ్య రచ్చ ఎక్కువ గా ఉంది. ఇక్కడ చాలా రోజుల నుంచి నేతల మధ్య పంచాయితీ నడుస్తోంది.

ఇక్కడ ఉన్న టి‌డి‌పి ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కొందరు టి‌డి‌పి నేతలు సహకరించడం లేదు. అందుకే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి ఓడిపోతూ వస్తుంది. పైగా ఈ సారి ఎన్నికల్లో ముద్దరబోయినకు పోటీగా కొందరు నేతలు నూజివీడు సీటు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు కమ్మ నేతలు నూజివీడు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇలా సీటు కోసం పోటీ పడుతున్న నేతలు..ఈ నెల 12న చంద్రబాబు నూజివీడు పర్యటనలో కూడా పోటీ పడుతున్నారు.

పర్యటనని విజయవంతం చేయాలని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నూజివీడు ఇంచార్జ్ ముద్దరబోయిన తాజాగా బాబు పర్యటనకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు.

కానీ ఈ సమావేశానికి కొందరు నేతలు హాజరు కాలేదు. ముఖ్యంగా చాట్రాయి మండలానికి సంబంధించిన నేతలు రాలేదు. దీంతో టి‌డి‌పిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అయితే వారు సెపరేట్ గా సమావేశం అవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే ఎవరికి వారు బాబు పర్యటనని విజయవంతం చేయాలని చుస్తున్నారు గాని..కలిసి పనిచేయాలని చూడటం లేదు. దీని వల్ల టి‌డి‌పికే ఇబ్బంది.

అయితే నూజివీడుకు ఎలాగో బాబు వస్తున్నారు కాబట్టి నేతలకు క్లాస్ పీకి..అంతా కలిసి కట్టుగా పనిచేసేలా చేస్తే బెటర్..అలాగే నూజివీడు అభ్యర్ధిని కూడా ఫిక్స్ చేస్తే ఓ గొడవ వదిలిపోతుంది.