వైఎస్సార్ ఫ్యామిలీ పట్ల ఎంతో విధేయతతో ఉండే మర్రి రాజశేఖర్‌కు జగన్ మరోసారి హ్యాండ్ ఇచ్చారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మర్రి అనుచరులకు జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. రెండున్నర ఏళ్లుగా ఊరిస్తున్న ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మర్రి రాజశేఖర్…కాంగ్రెస్‌లో ఉండగా వైఎస్సార్‌కు విధేయతతో ఉండేవారు. కమ్మ వర్గానికి చెందిన నాయకుడైన సరే వైఎస్సార్ ఫ్యామిలీపై అభిమానం చూపించేవారు. ఇక వైఎస్సార్ కూడా మర్రికి బాగానే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

ఆ అభిమానంతోనే వైఎస్సార్ చనిపోయాక మర్రి…జగన్‌కు అండగా నిలబడ్డారు. అలాగే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి చిలకలూరిపేట బరిలో ఓడిపోయారు. అయినా సరే పార్టీని వదిలిపెట్టకుండా ముందుకెళ్లారు. ఇదే క్రమంలో జగన్ కోసమని చెప్పి 2019 ఎన్నికల్లో సీటు కూడా త్యాగం చేశారు. చిలకలూరిపేట సీటుని విడదల రజినికి కేటాయించారు. అలాగే మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

అందుకే ఆ ఎన్నికల్లో రజిని విజయం కోసం మర్రి కష్టపడ్డారు. రజిని గెలవడానికి కారణమయ్యారు. ఇక గెలిచాక రజిని, మర్రికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని సంగతి తెలిసిందే. అయినా సరే జగన్ మీద ఆశతో మర్రి ఎదురుచూస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తే పరిస్తితి మారుతుందని అనుకున్నారు. కానీ జగన్…తాజాగా స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలని భర్తీ చేశారు…కానీ మర్రికి మాత్రం పదవి ఇవ్వలేదు.

గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావులకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉమ్మారెడ్డి సీనియర్ కాబట్టి ఆయనకు పదవి దక్కింది..అయితే మురుగుడు మొన్న ఈ మధ్యే టీడీపీని వీడారు. అయితే ఇంకా వైసీపీలో చేరలేదు. అయినా సరే ఆయనకు పదవి ఇచ్చేశారు. కానీ ఎప్పటినుంచో జగన్ కోసం పనిచేస్తున్న మర్రికి మాత్రం పదవి దక్కలేదు. మరి రానున్న రోజుల్లో ఏదైనా పదవి ఇస్తారా? లేక అలాగే వదిలేస్తారా? అనేది చూడాలి.

Discussion about this post