ఏపీ రాజకీయాల్లో వారసుల హవా ఎక్కువనే సంగతి తెలిసిందే. ప్రతి రాజకీయ నాయకుడు….తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని అనుకుంటారు. అలాగే తమ వారసులకు పెత్తనం ఇవ్వాలని అనుకుంటారు. అలా అనేక మంది రాజకీయ వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. అసలు చెప్పాలంటే దివంగత వైఎస్సార్ వారసుడుగా జగన్, చంద్రబాబు వారసుడుగా లోకేష్‌లు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఏపీలో అనేక మంది నేతల వారసులు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అయితే అధికారంలో ఉన్న నేతలు వారసులు ఎలాంటి హోదా లేకపోయినా సరే అధికారం చెలాయిస్తున్నారు. అలాగే రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వారసుడు కృష్ణమూర్తి గురించి ఎలాంటి కథనాలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. అంతకముందు పేర్ని వారసుడు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

కానీ తన తండ్రి మంత్రి అయ్యాక కిట్టు బయటకొచ్చారు…ఇప్పుడు తండ్రి అధికారంతో బాగా పెత్తనం కూడా చేస్తున్నారు. అసలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎలాంటి హోదా లేకుండా కిట్టు వెళ్లిపోతున్నారు. అసలు అధికారులు కూడా….మంత్రి గారి వారసుడుకు వంత పడుతున్నారు. అలాగే అనేక కార్యక్రమాలకు కిట్టుని అతిథిగా పిలుస్తున్నారు. ఇటీవల ఆర్టీసీలో ఒక కార్యక్రమం జరిగితే..దానికి కిట్టుని అతిథిగా పిలిచారు. ఇలా ఒకటి ఏంటి అనేక కార్యక్రమాలకు ఆయన్ని అతిథిగా పిలుస్తున్నారు.

పైగా ప్రభుత్వ పాఠశాలకు ఏదో ప్రభుత్వ పెద్ద మాదిరిగా వెళ్ళి హడావిడి చేస్తున్నారు. ఇక మంత్రిగారి వారసుడు చేస్తున్న చిత్రాలకు బందరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎంత మంత్రి కొడుకు అయితే మాత్రం ఇంత హడావిడి చేయాలా? అని మాట్లాడుతున్నారు. అధికారాన్ని వాడుకుని హడావిడి చేసే బదులు…ప్రజలకు పనికొచ్చే నాలుగు పనులు చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది కదా అంటున్నారు. ఇక వారసుడు వల్ల నానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Discussion about this post