జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఒకేసారి మంత్రివర్గం ఏర్పాటు చేయడంతో పదవులు ఆశించిన వారు కాస్త నిరాశకు గురయ్యారు. దీంతో మంత్రుల పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తానని, పాతవారు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారని జగన్ మొదట్లోనే చెప్పారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చి కరెక్ట్ రెండున్నర ఏళ్ళు అవుతుంది. మరి ఈ క్రమంలో ఆయన మంత్రివర్గంలో మార్పులు కూడా చేస్తారా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. రాష్ట్రంలో మంత్రివర్గంలో మార్పులు గురించి పెద్దగా చర్చలు అయితే జరగడం లేదు. మధ్యలో సగం మంత్రివర్గాన్ని మార్చవచ్చని…కాదు కాదు జగన్ పూర్తి మంత్రివర్గాన్ని మార్చడానికి సిద్ధమవుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

దీంతో అందరూ మంత్రివర్గం నుంచి తప్పుకుంటారని ప్రచారం మొదలైంది. సరే పూర్తిగా చేస్తారా…లేక సగం చేస్తారా అనే విషయం పక్కనబెడితే మంత్రివర్గంలో మార్పులు ఎప్పుడు చేస్తారనే అంశం తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపించడం లేదు. అంటే మంత్రులకు మరో ఆరు నెలలు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే కరోనా కారణంగా మధ్యలో చాలా సమయం పోయింది. మంత్రులు పని చేయడానికి అవకాశం దొరకడలేదు. అలాగే నిధులు సరిగ్గా లేకపోవడం వల్ల ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే రెండున్నరేళ్లు గడచిపోయాయన్న అభిప్రాయం మంత్రుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం జగన్‌తో సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు..ఇంకో ఆరు నెలలు సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇక పరిస్తితులని బేరీజు వేసుకుని జగన్…మరో ఆరు నెలల పాటు మంత్రులని కొనసాగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంటే మంత్రులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే అని చెప్పొచ్చు. మరి ఆరు నెలల తర్వాత…పూర్తిగా మంత్రివర్గాన్ని మారుస్తారో? లేక ఎవరైనా కొనసాగిస్తారో చూడాలి.

Discussion about this post