ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గం మార్పులపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది. అంటే 80 శాతం కొత్తవారు జగన్ క్యాబినెట్‌లోకి వచ్చే అవకాశముందని మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… మాత్రం 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని చెప్పారు.

త్వరలోనే జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ప్రక్షాళన జరుగుతుందని చెప్పారు. అంటే ఇప్పుడున్న 25 మంది మంత్రులని పక్కనబెట్టేసి…వారి ప్లేస్‌లో కొత్తవారిని పెట్టనున్నారని తెలుస్తోంది. కాకపోతే ఈ మంత్రివర్గంలో మార్పులు గురించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు మంత్రులంతా డమ్మీలని అలాంటప్పుడు మంత్రులని మార్చల్సిన అవసరం ఏముంటుందని అంటున్నారు. కొత్తగా వచ్చిన వారు కూడా డమ్మీలుగానే ఉంటారని మాట్లాడుతున్నారు.

వైసీపీ పాలనలో మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలు, నిమిత్తమాత్రులు మాత్రమే అని, వీరు మంత్రులుగా ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే అని అంటున్నారు. అసలు రాష్ట్ర సమస్యలన్నిటికీ కారకుడు సిఎం జగన్ అని ఫైర్ అవుతున్నారు. సిఎం జగన్‌నే పక్కనబెట్టేసి కొత్త సిఎంని నియమిస్తే బెటర్ అని అంటున్నారు. అప్పులు, అరాచకాలు, అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారడానికి మూలకారకుడు సీఎం జగన్ అని, ఆయనను మారిస్తే తప్ప రాష్ట్ర పరిస్థితులు మారవని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.

సీఎం జగన్ కంటే సమర్థంగా పరిపాలించే వాళ్లు అనేకమంది వైసీపీలో ఉన్నారని, కాబట్టి ఏకంగా సిఎంనే మారిస్తే బెటర్ అంటున్నారు. ఒకవేళ కొత్త మంత్రులని పెట్టిన వారు కూడా డమ్మీలే అవుతారని, కాబట్టి మంత్రులు మారిన పావలా ఉపయోగం లేదని అంటున్నారు.

Discussion about this post