ఏపీలో రాజకీయ పరిస్తితులు మారుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు వైసీపీ బాగా బలంగా ఉన్నట్లే కనిపించింది. కానీ నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తుందనే సంగతి అర్ధమవుతుంది. వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ నేతలు కూడా ఎక్కడకక్కడ పుంజుకుంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికలనాటికి ఈ పరిస్తితి మరింత మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేల విషయం పక్కనబెడితే…టీడీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే…వారిలో కూడా కొందరికి మైనస్ మార్కులు పడుతున్నాయని తెలుస్తోంది. టీడీపీని వదిలేసిన నలుగురు ఎమ్మెల్యేలని పక్కనబెడితే…ప్రస్తుతానికి టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరి ఈ 19 మందిలో కొంతమందికి నెగిటివ్ కనిపిస్తోంది. ఈ రెండున్నర ఏళ్లలో కొందరు ఎమ్మెల్యేలని ప్రజలకు దగ్గర లేకపోవడం వల్ల మైనస్ మార్కులు పడుతున్నాయని చెప్పొచ్చు.

అయితే ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు. ఉదాహరణకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులని చూస్తే అర్ధమవుతుంది. వారు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటారు…ప్రజల కోసం పనిచేస్తారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నాం కదా…మనం చేసేది ఏముందిలే అన్నట్లు,కాస్త ప్రజలకు దూరంగా ఉన్నారు.



అలాంటి వారు రాను రాను ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. అలా ఇబ్బంది పడేవారిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్‌లు ఉన్నారు. వీరికి నెగిటివ్ ఎక్కువ కనిపిస్తోంది. కాకపోతే ఈ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలకు ఇంకా నెగిటివ్ పెరిగితే చెప్పలేం. అటు విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గురించి చెప్పాల్సిన పని లేదు. ఈయన గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో లేరు.




Discussion about this post