ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే..మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 9 స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలు మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి..కాబట్టి ఆ 9 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడే ఛాన్స్ ఉంది. ఇటు 2 టీచర్ స్థానాలు ఉన్నాయి. టీచర్లు సాధారణంగా తమ సంఘాల అభ్యర్ధుల వైపు మొగ్గు చూపుతారు. లేదా అధికార పార్టీ వైపు ఉనత్రు. కాబట్టి ఈ రెండు సీట్లపై కూడా టిడిపి ఆశలు వదులుకున్నట్లే.

ఇక అసలైన ఓటింగ్ గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఉంటుంది. ఈ స్థానాల్లో ప్రజా నాడీ అర్ధమవుతుంది. మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కడప-కర్నూలు-అనంతపురం, ప్రకాశం-నెల్లూరు-అనంతపురం, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాల్లో టిడిపి అభ్యర్ధులని ప్రకటించారు. అటు వైసీపీ అభ్యర్ధులు, బిజేపి అభ్యర్ధులు రంగంలోకి దిగారు. అయితే సీమ పరిధిలో ఉన్న రెండు స్థానాలని పక్కన పెడితే..ఉత్తరాంధ్ర స్థానంపైనే టిడిపి ఆశలు పెట్టుకుంది.

గతంలో ఈ స్థానంలో టిడిపి..బిజేపికి మద్ధతు ఇవ్వడం వల్ల..బిజేపి తరుపున మాధవ్ గెలిచారు. ఇప్పుడు అదే బిజేపి నుంచి మాధవ్ బరిలో దిగుతున్నారు. కానీ ఈ సారి బిజేపి ఒంటరిగా బరిలో ఉంటుంది. పైగా జనసేన మద్ధతు ఇస్తుందో లేదో క్లారిటీ లేదు. అటు టిడిపి నుంచి వేపాడ చిరంజీవి రావు పోటీ చేస్తున్నారు. అయితే టిడిపి రెబల్ అభ్యర్ధిగా రామ్మూర్తి నాయుడు పోటీ చేస్తారని తెలుస్తోంది.

కానీ ఆయనని ఎలాగోలా బుజ్జగించి పోటీ నుంచి తప్పించాలని టిడిపి అధిష్టానం చూస్తుంది. అయితే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతని గంటా శ్రీనివాసరావుకు అప్పగించారు. ఇంతకాలం పార్టీలో యాక్టివ్ గా లేని గంటా పరీక్ష పెట్టారు. అయితే ఉత్తరాంధ్రలో టిడిపికి బలం ఉంది కాబట్టి..గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. చూడాలి మరి ఆ స్థానం ఎవరికి దక్కుతుందో.
