సినీ నటుడు మోహన్ బాబు….సిఎం జగన్ బంధువు అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆయన గత ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో జగన్‌ని గెలిపించాలని మోహన్ బాబు వైసీపీకి ప్రచారం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎన్నికల ముందు ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ కోసం మోహన్ బాబు రోడ్ల మీద చేసిన ఫీట్లు అందరూ చూశారు.

తమ కాలేజీలకు బాబు ఫీజులు ఇవ్వడం లేదని చెప్పి హడావిడి చేశారు. మరి ఈయనతో పాటు చాలామంది నటులు అలాగే పర్ఫామెన్స్ చేసి జగన్ గెలవడానికి కారణమయ్యారు. మరి గెలిచాక జగన్ ఏం చేస్తున్నారో ఆ నటులకు క్లారిటీ లేనట్లుగా ఉంది. జగన్ పాలనలో పథకాలు వల్ల కొందరికే లబ్ది చేకూరుతుంటే…పన్నుల భారం వల్ల మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇక ఫీజుల విషయంలో కాలేజీకి ఒక రకంగా ఫీజులు మార్చేశారు. కాలేజీ ప్రమాణాలతో సంబంధం లేకుండా ఇష్టమైన వాళ్లకు ఫీజులు పెంచారు, ఇష్టం లేని వాళ్లకు ఫీజులు తగ్గించారు. అలాగే పీజీ విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకమే తీసేశారు. దీనిపై మోహన్ బాబు ఏం స్పందించడంలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా జగన్‌ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొందరు ఐఏఎస్‌లు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ దెబ్బతిన్న మాట వాస్తవమని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అంటే అప్పుడు ఫీజు రీఎంబర్స్‌మెంట్ చాలా వరకు బాబు ప్రభుత్వం చెల్లించే ప్రయత్నం చేసింది. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. దానికేమో బాబు కారణం…ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఆ తప్పు ఐఏఎస్‌ల మీద తోసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. ఇలా తప్పించే ప్రయత్నం చేసిన జనాలు నమ్మరాని మోహన్ బాబుకు ఇంకా అర్ధం కావడం లేదు అనుకుంటా.

Discussion about this post