పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న..పార్టీ కోసం ఎప్పుడు నిలబడే నాయకులు కొందరు ఉంటారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి…పార్టీ కష్టాలు ఉందని చెప్పి వదిలి వెళ్లిపోయే నేతలు మాదిరిగా కాకుండా పార్టీ కోసం ఎప్పుడు నిలబడి ఉండే నాయకుల్లో సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఒకరనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఈయన పార్టీకి అండగానే ఉంటూ వచ్చారు..గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది టీడీపీని వదిలారు…అలాగే కొందరు నేతలు బయటకొచ్చి పోరాటాలు చేయడానికి కూడా ఆలోచించారు…కానీ అయ్యన్న అలా కాదు…పార్టీ తరుపున నిత్యం పోరాడుతూనే వచ్చారు.

విశాఖపట్నంలో టీడీపీ తరుపున పోరాడిన ఏకైక నాయకుడుగా నిలిచారు. ఇప్పుడంటే మిగతా నేతలంతా బయటకొచ్చి మాట్లాడుతున్నారు గాని…ముందు నుంచి అయ్యన్న మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా పార్టీ కోసం పోరాడుతున్న అయ్యన్న…తన ఫ్యామిలీకి ఇంకో సీటు వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఇప్పటికే నర్సీపట్నం సీటు బాధ్యతలు అయ్యన్న చూసుకుంటున్నారు…నెక్స్ట్ ఎన్నికల్లో అయ్యన్న మళ్ళీ ఇక్కడ నుంచే బరిలో నిలబడనున్నారు. అయితే తన కుమారుడు విజయ్‌కు ఎంపీ సీటు కోసం అయ్యన్న ట్రై చేస్తున్నారు. విజయ్‌కు ఎంపీ సీటు అయితే బాగా సెట్ అవుతుందని పలు సందర్భాల్లో అయ్యన్న మాట్లాడారు కూడా.

అటు విజయ్ సైతం పార్టీ తరుపున పనిచేస్తున్న సంగతి తెలిసిందే..ఇలా అయ్యన్న ఫ్యామిలీ టీడీపీ కోసం గట్టిగానే కష్టపడుతుంది. అందుకే తన కుమారుడుకు అనకాపల్లి ఎంపీ కావాలని అయ్యన్న కోరుకుంటున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు సైతం అయ్యన్న ఫ్యామిలీకి ఇంకో సీటు ఇస్తే మంచిదే అని చెబుతున్నారు. ఎలాగో అనకాపల్లి పార్లమెంట్‌లో టీడీపీకి నాయకుడు లేరు. కాబట్టి ఆ సీటు విజయ్‌కు ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మరి చూడాలి అయ్యన్న తనయుడుకు ఎంపీ సీటు దక్కుతుందో లేదో.

Discussion about this post