ముందస్తు ఎన్నికలు..ఇంతకాలం ఈ టాపిక్ గురించి తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడిచింది గానీ..ఏపీ రాజకీయాల్లో మాత్రం చర్చ జరగలేదు. ఏదో టీడీపీ అధినేత చంద్రబాబు..జమిలి ఎన్నికల గురించి మాట్లాడారు గానీ…కేవలం ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి మాత్రం మాట్లాడలేదు. కానీ తాజాగా ఆయన ముందస్తు ఎన్నికల గురించి కామెంట్ చేశారు. ముందస్తు ఎన్నికల గురించి తాను విన్నానని, ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

అయితే చంద్రబాబు ఏమి ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పలేదు…ఎప్పుడొచ్చిన ఎదురుకుంటామని మాత్రమే చెప్పారు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెప్పడానికి ఆయన ఏమైనా చీఫ్ ఎన్నికల కమిషనరా? లేక బీజేపీకి సలహాదారుడా? అని ప్రశ్నించారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు.

అంటే ముందస్తుపై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేనట్లు చెప్పారు. కాకపోతే నిప్పు లేకుండా పొగ రాదు అన్నట్లుగా..ముందస్తుపై వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కథనాలు వస్తున్నాయి. అందుకే చంద్రబాబు సైతం ముందస్తు గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే…వైసీపీ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరిగింది..ఐదేళ్ల పాటు పూర్తిగా ఉంటే..ఇంకా ఎక్కువ వ్యతిరేకత రావొచ్చు..అందుకే ముందే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి, ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సక్సెస్ అయ్యారో అలాగే…ఏపీలో కూడా ముందస్తుకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇదంతా ప్రశాంత్ కిషోర్ డైరక్షన్‌లోనే జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం వస్తుంది. కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదురుకునేలా టీడీపీ శ్రేణులని బాబు ప్రిపేర్ చేస్తున్నారు. మరి చూడాలి ముందస్తు ఉంటుందో…లేదో?

Discussion about this post