దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది….కానీ ఏపీకే దరిద్రం ఏంటో గానీ రాజధాని ఏదో తెలియని పరిస్తితి ఉందని ప్రజలు మాట్లాడుకునే వరకు వచ్చింది. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. ఇక అప్పుడు అందరూ దీన్ని ఆమోదించారు. పైగా వేరే ప్రాంతాల్లో రాజధాని అంశం గురించి రచ్చ ఏం జరగలేదు. అయితే ఐదేళ్లలో అమరావతిని చంద్రబాబు ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు.

సరే బాబు చేయకపోతే జగన్ ఏదొకటి చేస్తారని జనం అనుకున్నారు. ఎలాగో భారీ మద్ధతుతో గెలిచారు. గెలిచాక కొన్ని రోజులు జగన్ వైఖరి ఏంటో ఎవరికి అర్ధం కాలేదు. రాజధానిపై ఎలాంటి ఊసు లేదు. అయితే సడన్‌గా రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడో ఒకటి, రెండు దేశాల్లో ఉన్న ఈ ఫార్ములాని ఏపీలో ప్రయోగించడానికి జగన్ సిద్ధమయ్యారు.

అయితే జగన్ ప్రయోగాన్ని అమరావతి రైతులు వ్యతిరేకించారు. భూములు ఇచ్చిన తమకు అన్యాయం చేయొద్దని, ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని, అభివృద్ధి ఎక్కడైనా చేసుకోవచ్చుని చెబుతూ, దాదాపు రెండేళ్లుగా అమరావతి రైతులు, ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. పైగా ఈ రాజధాని అంశంపై కోర్టుకు వెళ్లారు. దీంతో మూడు రాజధానులకు బ్రేక్ పడింది.

అయితే జగన్ సైతం మూడు రాజధానులని కావాలనే తీసుకొచ్చారని ప్రజలకు అర్ధమవుతుంది. ఎందుకంటే రెండేళ్ళు అవుతున్నా సరే ఇంతవరకు రాజధాని అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేదు. పైగా మంత్రులేమో త్వరలోనే మూడు రాజధానులు అయిపోతాయని ప్రకటనలు చేస్తారు. కానీ అది ముందుకు వెళ్లదు. ఇటు కోర్టులు సైతం మూడు రాజధానులకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకుని రాజధానిపై క్లారిటీ ఇస్తే బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు. ఎంతకాలం పక్కన వాళ్ళు మీ రాజధాని ఏది అని అడిగితే కన్ఫ్యూజ్ అవుతూ ఉండాలని అంటున్నారు.

Discussion about this post