ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు ఉన్న స్థానాల్లో ముమ్మిడివరం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1996 బై పోల్, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో అంతటి వైసీపీ వేవ్ లో కూడా కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి పొన్నాడ సతీశ్ కుమార్ పోటీ చేయగా, టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీ చేశారు..జనసేన నుంచి పితాని బాలకృష్ణ పోటీ చేశారు.



ఇక జనసేనకు 33 వేల ఓట్లు పడ్డాయి. అలా జనసేన ఓట్లు చీల్చడంతో వైసీపీ 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అదే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి గెలుపు దక్కేది కాదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే సతీశ్‌కు అంత అనుకూలమైన వాతావరణం లేదు..ఆయనపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

అదే జరిగితే వైసీపీ ఎమ్మెల్యే సతీశ్ గెలుపు గగనమే. ఇక పొత్తులో పోటీ చేస్తే ముమ్మిడివరం సీటు ఎవరికి దక్కుతుందనేది పెద్ద ట్విస్ట్. ఇక్కడ టీడీపీకి బలం ఎక్కువే. అదే సమయంలో జనసేన సపోర్ట్ ఉంటేనే..ఇక్కడ టీడీపీ గెలవగలదు. ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది. కాకపోతే పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

దీంతో టీడీపీ నేత సుబ్బరాజు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని తాజాగా సుబ్బరాజు ఖండించారు..తుదిశ్వాస వరకు టీడీపీలోనే ఉంటానని, అలాగే సీటు తనదే అని చెప్పుకొచ్చారు. మరి చూడాలి ఈ సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.

Leave feedback about this