ఇటీవల ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…2024 వరకు వెళ్లకుండా ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి జగన్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చంద్రబాబుతో పాటు ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు కూడా ముందస్తుపై నమ్మకంగా ఉన్నాయి. ఏ క్షణమైనా జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని టీడీపీ నేతలు అంటున్నారు..అందుకే టీడీపీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు.

అంటే ప్రతిపక్షాల పాయింట్ ఆఫ్ వ్యూలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది…కానీ ఈ ముందస్తు ఎన్నికల గురించి వైసీపీ నుంచి వేరే సమాధానం వస్తుంది…తమని ప్రజలు పాలించమని ఐదేళ్లు సమయం ఇచ్చారని, 2024 వరకు తమ ప్రభుత్వం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు…ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఏమి లేవని అంటున్నారు.

వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, ఐదేళ్ల పాటు పరిపాలించేందుకు ప్రజలు తమను గెలిపించారని, తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని విమర్శించారు. అంటే వైసీపీ నుంచి ముందస్తుపై క్లారిటీ ఇచ్చేస్తుంది…ముందస్తుకు వెళ్ళే ప్రసక్తి లేదని తెలుస్తోంది.

ఓ వైపు టీడీపీ ఏమో ముందస్తు అంటుంది..వైసీపీ ఏమో లేదు అంటుంది..దీంతో పూర్తి క్లారిటీ రావడం లేదు..కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…పైకి ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని చెబుతున్నా సరే…వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని అంటున్నారు.

కాబట్టి వైసీపీ స్ట్రాటజీలని నమ్మడానికి లేదని, ఏ సమయంలోనైనా ముందస్తుకు వెళ్లొచ్చని, ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, ఆ వ్యతిరేకత పూర్తిగా పెరిగే లోపే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. మొత్తానికి ముందస్తు ఎన్నికలపై డౌట్ ఉందనే చెప్పొచ్చు.

Discussion about this post